

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నుండి ప్రతిష్టాత్మక ‘ఎన్టీఆర్ జాతీయ అవార్డు’ను ఆయన అందుకున్నారు, అవార్డుతో పాటు వచ్చిన రూ.10 లక్షల నగదు బహుమతిని పూర్తిగా సేవా సంస్థలకు విరాళంగా అందించారు. తన కుమారుడు రామ్ చరణ్(రామ్ చరణ్) పుట్టినరోజు సందర్భంగా ఈ విరాళాలను అందించడం విశేషం.
సాధారణంగా సెలబ్రిటీల పుట్టినరోజులు అంటే ఆర్భాటాలు, వేడుకలు ఉంటాయి. కానీ చిరంజీవి మాత్రం చరణ్ పుట్టినరోజును ఐదు విభిన్న సేవా సంస్థలకు అండగా నిలబడటం ద్వారా సెలబ్రేట్ చేశారు.
.webp)
సర్వ్ ఫౌండేషన్: వృద్ధాశ్రమంలో అవసరాల కోసం చిరంజీవి విరాళం అందించారు. గతంలో ‘గేమ్ చెంజర్’ షూటింగ్ సమయంలో చరణ్‌ను కలిసిన వృద్ధులు, ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. వారి కోరిక మేరకు 30 మంది వృద్ధులను బ్లడ్ బ్యాంక్‌కు ఆహ్వానించారు, వారికి కొత్త బట్టలు పెట్టి, విందు భోజనం ఏర్పాటు చేశారు.
దేవ్నార్ ఫౌండేషన్: అంధుల సాధికారత కోసం కృషి చేస్తున్న ఈ సంస్థకు మెగాస్టార్ ఆర్థిక సాయం అందించారు.
వాల్మీకి & నయశ్రీ ఫౌండేషన్లు: అనాథ పిల్లల సంరక్షణ, విద్యావకాశాల కోసం ఈ రెండు సంస్థలకు విరాళాలు.
బసవతారక క్యాన్సర్ ఆసుపత్రి: క్యాన్సర్‌తో పోరాడుతున్న ఒక చిన్నారి చికిత్స నిమిత్తం చిరంజీవి విరాళం అందించారు.
రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి చేసిన ఈ సేవా కార్యక్రమాలపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ప్రస్తుతం చిరంజీవి కెరీర్ పరంగా కూడా ఫుల్ జోష్‌లో ఉన్నారు. ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వరుసగా క్రేజీ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టారు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. అలాగే, ‘విశ్వంభర’ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.