Home ఎంటర్‌టెయిన్మెంట్ ఈ నెల 26న రష్మిక, విజయ్ దేవరకొండ పెళ్లి!.. వైరల్ అవుతున్న ప్రమోద్ శెట్టి వ్యాఖ్యలు – VRM MEDIA

ఈ నెల 26న రష్మిక, విజయ్ దేవరకొండ పెళ్లి!.. వైరల్ అవుతున్న ప్రమోద్ శెట్టి వ్యాఖ్యలు – VRM MEDIA

by VRM Media
0 comments
tmdb-header-middle-logo



-రష్మిక, విజయ్ దేవరకొండ పెళ్లి ఈ నెల 26కి ఫిక్స్ అయ్యిందా!
-పెళ్లి సందర్భంగా కన్నడ నటుడు ప్రమోద్ శెట్టి చేసిన వ్యాఖ్యలేంటి!
-మరి రష్మిక ఆ ఇద్దరని పీలుస్తుందా!
-పూర్తి డీటెయిల్స్ చూద్దాం.

అధికారకంగా ప్రకటించకపోయినా అధికారకంగా చెలామణిలో ఉన్న వార్త రష్మిక(Rashmika Mandanna),విజయ్ దేవరకొండ(vijay Deverakonda)మ్యారేజ్. ఫిబ్రవరి 26 న రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ కోటలో చాలా గ్రాండ్ గా జరగనుందనేది టాక్. మరి ఇద్దరి అభిమానులు సైలెంట్ గా ఉంటారా? పెళ్ళికి సంబంధించిన స్పెషల్స్ చెప్పమని రష్మిక, విజయ్ ల ఇనిస్టాగ్రమ్ అకౌంట్స్ కి కౌంట్ చెయ్యడానికి వీలు లేని మెసెజెస్.ఎక్స్ వేదికగా కూడా సేమ్ సిత్యువేషన్. దీనితో సోషల్ మీడియాలో సందడి వాతావరణం నెలకొని ఉంది. మరో వైపు రష్మిక మమల్ని పెళ్లికి పిలుస్తుందని అనుకోవడం లేదని ప్రమోద్ శెట్టి(ప్రమోద్ శెట్టి)చేసిన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియా ఆతిధ్యం ఇవ్వాల్సిన పరిస్థితి. పూర్తి డీటెయిల్స్ చూద్దాం.

ప్రమోద్ శెట్టి.. కన్నడ చిత్ర సీమలో మంచి క్రేజ్ ఉన్న యాక్టర్. 2010లో కెరీర్ ప్రారంభించిన స్టిల్ ముపైకి పైగా చిత్రాలు వచ్చాయి. కాంతార లో గుడ్డి సుధాకర గా మెప్పించాడు. రీసెంట్ గా ప్రమోద్ శెట్టి దగ్గర కొంత మంది మీడియా ప్రతినిధులు రష్మిక వివాహం గురించి ప్రస్తావించారు. దీంతో ప్రమోద్ శెట్టి మాట్లాడుతు రష్మిక తన వివాహానికి నన్ను, రక్షిత్ శెట్టిని ఆహ్వానిస్తున్నట్లు భావించడం లేదు.పిలవకపోవడంలో ఆశ్చర్యం కూడా లేదు. రక్షిత్ శెట్టి(రక్షిత్ శెట్టి)తన సినిమాలతో ప్రస్తుతం ఉన్నాడు.రష్మిక తో జరిగిన ఎంగేజ్ మెంట్ రద్దు పై రక్షిత్ ఏమాత్రం బాధపడటం లేదు. ఈ విషయం ఆయన శ్రేయోభిలాషులందరికీ తెలుసునని ప్రమోద్ శెట్టి చెప్పుకొచ్చాడు.

కూడా చదవండి: అల్లు అర్జున్ కొత్త పార్టీ.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన పిక్స్

2017 జులై 3 న రక్షిత్, రష్మిక ల నిశ్చితార్థం జరిగింది.ఇప్పటికి కారణం తెలియదు గాని పరస్పర అంగీకారంతో ఎంగేజ్‌మెంట్ కాన్సిల్ చేసుకున్నారు. రష్మిక తొలి చిత్రం ‘కిరిక్ పార్టీ’ లో ఇద్దరు జంటగా చేసిన విషయం తెలిసిందే. ఇక ప్రమోద్ శెట్టి ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత సోషల్ మీడియా సైలెంట్ గా ఉండటం జరగని పని కదా! పైగా వీకెండ్. దీంతో రష్మిక తన వివాహానికి రక్షిత్ శెట్టి, ప్రమోద్ శెట్టి ని పిలుస్తుందా లేదా అని పోల్ లాంటిది ఏర్పాటు చేసుకొని ఎక్కువ ఓట్లను ఆసక్తిగా గమనిస్తున్నారు. ‘కిరిక్ పార్టీ’ లో ప్రమోద్ శెట్టి చేసిన విషయం తెలిసిందే.

2,803 Views

You may also like

Leave a Comment