Home ఎంటర్‌టెయిన్మెంట్ ఇద్దరిలో హీరో ఎవరు! మీకైనా తెలుసా – VRM MEDIA

ఇద్దరిలో హీరో ఎవరు! మీకైనా తెలుసా – VRM MEDIA

by VRM Media
0 comments
tmdb-header-middle-logo



-కమల్, రజినీ ల ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసింది
-నెల్సన్, అనిరుద్ ఏమంటున్నారు
-రికార్డుల వేట గ్యారంటీ

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ కి రెస్ట్ లేకుండా ముస్తాబవుతున్న కాంబో కమల్ హాసన్(కమల్ హాసన్),రజనీకాంత్(రజినీకాంత్).అసలు ఈ ఇద్దరి కాంబోలో సినిమా వస్తుందని అభిమాని మేధావుల ఊహలకి కూడా అందలేదు. దీంతో అనౌన్స్ మెంట్ వచ్చిన దగ్గర్నుంచి అప్ డేట్స్ కోసం అభిమానులతో పాటు ఇండియన్ సినిమా లవర్స్ మొత్తం సోషల్ మీడియా వద్ద తిష్ట వేసుకొని కూర్చున్నారు. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ అయ్యింది. అలా రిలీజ్ అయ్యిందో లేదో ఇద్దరి అభిమానులకి పూనకాలు తెప్పిస్తుంది. అంత పూనకాలు తెప్పించేలా గ్లింప్స్ లో ఏముందో చూద్దాం.

సుమారు మూడు నిమిషాల ముపై ఆరు సెకన్ల నిడివితో గ్లింప్స్ ఉండగా రజనీ,కమల్ లు డైరెక్టర్ నెల్సన్ తో ‘ఒకరు వాడిన వస్తువులను ఒకరు వాడమని చెప్పి కోటు, షూస్, బెల్ట్, వాచీ, స్పెక్ట్స్ తీసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు తమ గదుల్లో నుంచి బయటకి వచ్చి కోపంగా చూసుకొని స్టైలిస్ట్ గా ఒక కారు మెకానిక్ షెడ్ లో నడుచుకుంటూ వచ్చారు.మరో పక్క ఫారిన్ లేడీస్ కార్ వాష్ చేస్తుండటం స్పెషల్ అట్రాక్షన్ గా ఉంది. ఆ తర్వాత కారు ఎక్కి తమ వెనక ఉన్న నెల్సన్, మ్యూజిక్ ని ఆఫర్ అనిరుద్ తో హీరో ఎవరని కమల్, రజినీ అడిగారు.

గ్లింప్స్ స్టార్టింగ్ లోనే నెల్సన్(Nelson),అనిరుద్(Anirudh)కనిపించి తమ మాటలతో మెస్మరైజ్ చేసారు.ఈ ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్ ని దక్కించుకునే అవకాశం రెడ్ జైంట్ మూవీస్ ని పొందగా, లెజండ్రీ డైరెక్టర్ అండ్ కెమెరామెన్ రాజీవ్ మీనన్(Rajev Menon)ఛాయాగ్రహణ బాధ్యతలు అందుకోవడం విశేషం. హీరోయిన్స్ తో పాటు మిగిలిన నటీనటుల వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

2,803 Views

You may also like

Leave a Comment