
.webp)
-నారీనారీనడుమమురారి తో హిట్ ట్రాక్ లోకి
-దీంతో బైకర్ పై భారీ అంచనాలు
-బిజినెస్ డీల్ ఇదేనంటూ చక్కర్లు కొడుతున్న న్యూస్
ఇక చాల్లే ప్లాప్స్ అనుకున్నాడో ఏమో రీసెంట్ గా ‘నారీ నారీ నడుమమురారి’ తో హిట్ ట్రాక్ లో వచ్చాడు శర్వానంద్(శర్వానంద్). రావడమే కాదు సంక్రాంతి సినిమాల పోటీని తట్టుకొని మరి భారీ కలెక్షన్స్ ని సాధించాడు. నటుడు గాను ఒక మెట్టు పైకి ఎదిగాడనే ప్రశంసలు అభిమానులు, ప్రేక్షకులు వ్యక్తం చేయడం జరిగింది. ఆ ఉత్సాహంతో ఇప్పుడు ‘బైకర్’ అనే వినూత్నమైన సబ్జెట్ తో కూడిన చిత్రంతో ఈ వేసవికి అడుగుపెట్టబోతున్నాడు. యువి క్రియేషన్స్(UV Creations)నిర్మిస్తుండగా అభిలాష్(అభిలాష్)దర్శకుడు. రీసెంట్ గా ఫిలింసర్కిల్స్ లో బైకర్ బిజినెస్ డీల్ ఇదే అంటూ న్యూస్ ఒకటి చక్కర్లు కొడుతుంది. ఆ డిటైల్స్ ఏంటో చూద్దాం.
నాన్ థియేట్రికల్ హక్కులు 35 కోట్ల రూపాయలకి అమ్ముడయ్యాయని, డిజిటల్ రైట్స్ ని నెట్‌ఫ్లిక్స్ 27 కోట్లకి దక్కించుకున్నట్టుగా చెబుతున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఎంతో పోటీ వాతావరణం మధ్య థియేట్రికల్ హక్కులను భారీ ధరకి కొనుగోలు చేసాడని, ఈ డీల్స్ ద్వారా యూవీ క్రియేషన్స్ లాభాల్లోకి వెళ్లిందనేది ఫిలిం సర్కిల్ టాక్. మాళవిక నాయర్(Malavika nair)హీరోయిన్ కాగా జిబ్రాన్ మ్యూజిక్.
ఇది కూడా చదవండి:Varalaxmi Sarath kumar: కన్నీళ్లు పెట్టుకుంటున్న వరలక్ష్మి శరత్ కుమార్.. నన్ను సపోర్ట్ చెయ్యండి
శర్వానంద్ అప్ కమింగ్ సినీ జర్నీని చూసుకుంటే ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోగి’ మూవీ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఈ ఏడాది చివర్లో విడుదల. ఆ వెంటనే శ్రీను వైట్ల దర్శకత్వంలో ఒక ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్ ని పట్టాలెక్కించను. ఈ ప్రాజెక్ట్ 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనేది మేకర్స్ ప్లాన్.మరి ఈ లెక్కన శర్వానంద్ జోరు ఇప్పట్లో ఆగేలా లేదని అనిపిస్తుంది.