Home ఎంటర్‌టెయిన్మెంట్ Kaattaan వెబ్ సిరీస్ రివ్యూ: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ – VRM MEDIA

Kaattaan వెబ్ సిరీస్ రివ్యూ: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ – VRM MEDIA

by VRM Media
0 comments
tmdb-header-middle-logo


వెబ్ సిరీస్: కాట్టాన్
నటీనటులు: విజయ్ సేతుపతి, మిళింద్ సోమన్, సుదేవ్, వీజే పార్వతి, రీచా జాకబ్ చేసారు
ఎడిటింగ్: షణ్ముగ సుందరం
సంగీతం: రాజేష్ మురుగేశన్
సినిమాటోగ్రఫీ: మధు నీలకందన్
నిర్మాతలు: విజయ్ సేతుపతి
దర్శకుడు: మణికందన్
ఓటీటీ: జియో హాట్ స్టార్

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన తాజా వెబ్ సిరీస్ ‘కట్టాన్’ (కట్టాన్). జియో హాట్‌స్టార్ వేదికగా ఈ క్రైమ్ మిస్టరీ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మణికందన్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ఎలా ఉందో ఓసారి చూసేద్దాం..

కథ:

అడ‌వికి ద‌గ్గ‌ర‌లో ఉన్న ఊరిలోని పోలీస్ స్టేష‌న్‌లో మూడేళ్లుగా ఒక్క కేసు న‌మోదు. దాంతో పోలీస్ స్టేష‌న్‌ను అక్క‌డి నుంచి ఎత్తేయాల‌ని అధికారులు నిర్ణ‌యించుకుంటారు. ఆ పోలీస్ స్టేష‌న్‌లో కానిస్టేబుల్‌గా ప‌నిచేసే కాళీ పాండియ‌న్ ది అదే ఊరు. స్టేషన్‌ను ఎత్తేస్తే త‌ను మ‌రో ఊరికి ట్రాన్స్‌ఫర్ కావాల్సి వ‌స్తుంద‌ని భ‌య‌ప‌డ‌తాడు. అదే సమయంలో మొండెం లేని త‌ల ఒక‌టి ఆ ఊరి సరిహద్దులలో దొరుకుతుంది. ఈ కేసును ఎస్ఐతో పాటు కాళీ పాండియ‌న్ ఇన్వెస్టిగేష‌న్ చేయ‌డం మొద‌లుపెడ‌తారు. వారి ఇన్వెస్టిగేషన్‌లో చనిపోయిన వ్యక్తి పేరు ముత్తు అలియాస్ కాట్టాన్ (విజయ సేతుప‌తి) అని నిజం బ‌య‌ట‌ప‌డుతుంది. ముత్తు గురించి ఒక్కొక్కరు ఒక్కో కథ చెప్తారు. ముత్తుకు కేర‌ళ మినిస్ట‌ర్ బెన్నీ, గ్యాంగ్‌స్ట‌ర్ శివ‌న్న‌తో (మిళింద్ సోమ‌న్‌)ఉన్న సంబంధం ఏంటి? ముత్తు పెళ్లి చేసుకోవాల‌ని ఆశ‌ప‌డిన సింధు ఎలా చ‌నిపోయింది? ముత్తు లైఫ్‌లోకి వచ్చిన మీనా ఎవరు? జానీ (సుదేవ్ నాయ‌ర్) అనే వ్య‌క్తితో పాటు ఓ జాత‌ర‌లో జ‌రిగిన జంట హ‌త్య‌ల‌కు ముత్తుకు ఎలాంటి సంబంధం ఉందా? ముత్తు మ‌ర‌ణం వెనుక ఉన్న మిస్ట‌రీని ఎస్ఐతో పాటు కానిస్టేబుల్ కాళీ పాండియ‌న్ క‌నిపెట్టారా లేదా అనేది ఈ వెబ్ సిరీస్ క‌థ‌.

విశ్లేషణ:

ఈ సిరీస్ మొత్తం పది ఎపిసోడ్ లు ఉన్నాయి. తమిళనాడు, కేరళ ప్రాంతాల్లో జరిగిన కథ ఇది. ఎక్కువ భాగం తమిళనాడులో జరగడం వల్ల అక్కడి నేటివిటి ఎక్కువగా కనపడుతుంది. అయితే ఈ సిరీస్‌లో మొదటి నుండి చాలా లెంతీ అండ్ బోరింగ్ స్క్రీన్ ప్లే సాగుతోంది. మొదటి ఎపిసోడ్ అయితే సప్పగా సాగుతుంది. ఎప్పుడూ అయితే ఎపిసోడ్ చివర్లో తల లేని మొండెం కనపడుతుందో అప్పటి నుండి కథలో వేగం పెరుగుతుంది. అయితే ముత్తు గురించి ఒక్కో ఎపిసోడ్‌లో ఒక్కోలా చూపిస్తారు.ముత్తు గతాన్ని కూడా బలంగా ఎలివేట్ చేయలేకపోయారు.

అనవసరమైన ఫైట్స్, పాటలు ఫ్లోను దెబ్బతీశాయి. ఇక రొమాంటిక్ సీన్లు కూడా ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్ ని మరీ డీటేలింగ్ గా చూపించడం కోసం ప్రతీది స్క్రీన్ మీద చూపించారు. అదే పెద్ద మైన్స్. సిరీస్ ని నాలుగు ఎపిసోడ్ లో ముగించొచ్చు. అంత ల్యాగ్ ఉంది సిరీస్. ఒక్కో ఎపిసోడ్ దాదాపు ముప్పై నిమిషాలు ఉంది. అలా మొత్తంగా పది ఎపిసోడ్ లు అంటే ఆడియన్స్ ఓపికకి పరీక్ష అన్నమాటే.

సిరీస్ మొత్తం ల్యాగ్ సీన్లే ఉంటాయనకుంటే ఇందులో మూడు పాటలు.. వాటిని స్కిప్ చేసే ఆప్షన్ ఉంది కాబట్టి ఒకే లేదంటే ఆడియన్ కి చిరాకు కలుగుతుంది. రాజేశ్ మురుగేశన్ మ్యూజిక్ బాగుంది. షణ్ముగ సుందరం ఎడిటింగ్ లో కొన్ని ల్యాగ్ సీన్లని ట్రిమ్ చేస్తే బాగుండు. మధు నీలకందన్ సినిమాటోగ్రఫీ బాగుంది. అడల్ట్ సీన్లు ఉన్నాయి. అసభ్య పదజాలం వాడలేదు. దర్శకుడు మణికందన్ ఎపిసోడ్ ల నిడివి విషయంలో కాస్త జాగ్రత్త వహించాల్సింది. నిర్మాణాల విలువ బాగున్నా, దర్శకుడు మణికందన్ మేకింగ్‌లో తడబడటం, కన్ఫ్యూజింగ్ నెరేషన్ వల్ల సిరీస్ తేలిపోయింది. విజయ్ సేతుపతి ఫ్యాన్స్ మాత్రం ఒక్కసారి చూసేయొచ్చు. ఇక ఫ్యామిలీతో కలిసి చూడకపోవడమే బెటర్. మొత్తంగా చెప్పాలంటే.. ‘కట్టాన్’ ఒక లెంగ్తీ అండ్ బోరింగ్ సిరీస్. ఏ పని లేకుండా మరీ ఖాళీగా ఉంటే తప్ప, ఈ సిరీస్ జోలికి వెళ్లకపోవడమే మంచిది. ఈ వీకెండ్‌లో జియో హాట్‌స్టార్‌లో ఏదైనా కంటెంట్ చూడాలనుకుంటే.. దీనికి బదులు వేరే ఆప్షన్స్ వెతుక్కోవడం బెటర్.


నటీనటుల పనితీరు:

ముత్తుగా విజయ్ సేతుపతి చక్కగా నటించాడు. మిగిలిన వారు వారి పాత్రల పరిధి మేర నటించారు.

ఫైనల్ గా : బోరింగ్ అండ్ లెంతీ సిరీస్.

రేటింగ్: 1.75 / 5

✍️. దాసరి మల్లేశ్

2,806 Views

You may also like

Leave a Comment