Home ఎంటర్‌టెయిన్మెంట్ ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ ఇంట తీవ్ర విషాదం! – VRM MEDIA

ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ ఇంట తీవ్ర విషాదం! – VRM MEDIA

by VRM Media
0 comments
tmdb-header-middle-logo


ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్(ప్రకాష్ రాజ్) కుటుంబంలో తీవ్ర విషాదం. ఆయన మాతృమూర్తి సువర్ణలత (86) ఈరోజు (సోమవారం) ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత సమస్యలతో ఆమె బాధపడుతున్నారు, బెంగళూరులోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.

సువర్ణలత భౌతికకాయాన్ని దర్శించుకునేందుకు పలువురు, రాజకీయ ప్రముఖులు తరలివస్తున్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం బెంగళూరులో జరగనున్నాయి.

ప్రకాశ్ రాజ్ తన తల్లితో ఉన్న అనుబంధాన్ని పలు సందర్భాల్లో పంచుకున్నారు. ఆమె మృతి పట్ల టాలీవుడ్, కోలీవుడ్ మరియు శాండల్‌వుడ్‌కు చెందిన ప్రముఖులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ప్రకాష్ రాజ్ కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు.

2,802 Views

You may also like

Leave a Comment