Home Uncategorized *అమరావతి ముఖ్యమంత్రి వారి కార్యాలయంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు ని కలిసిన రాజానగరం శాసన సభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ *

*అమరావతి ముఖ్యమంత్రి వారి కార్యాలయంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు ని కలిసిన రాజానగరం శాసన సభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ *

by VRM Media
0 comments

VRM media అయినవిల్లి భద్రం

రాజానగరం నియోజకవర్గ పరిధిలోని పలు కీలక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ని మర్యాదపూర్వకంగా కలిసి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి వినతులను అందజేశారు. నియోజకవర్గ ప్రజలు, రైతులు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ క్రింది ప్రధాన అంశాలపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు.

1. భూసేకరణ మరియు రెవెన్యూ సమస్యల పరిష్కారం

👉 కోరుకొండ రైతుల భూములు దేవాదాయ శాఖ ఖాతాలో సెక్షన్ 22-A (1)(C) కింద చేర్చబడ్డాయి. దీనివల్ల భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నందున కాబట్టి ఇంకా మిగిలి ఉన్నా భూములను నిషేధిత జాబితా నుండి తొలగించాలని కోరారు.

👉 సీతానగరం మండలంలో పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం కోసం భూములిచ్చిన 94 మంది చిన్న, సన్నకారు రైతులకు గత 8 ఏళ్లుగా నష్టపరిహారం అందలేదు. గౌరవ ముఖ్యమంత్రి గతంలో ఇచ్చిన హామీ మేరకు రైతులకు 6 శాతం వడ్డీతో పరిహారం చెల్లించాలని, మిగిలిన భూములను 22-A నుండి తొలగించాలని విజ్ఞప్తి చేశారు.

👉 సాస్కి (SASCI) రోడ్లకు భూసేకరణ: కోరుకొండ మండలం మధురపూడి గ్రామంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ మంజూరు చేసిన రెండు గ్రామీణ రోడ్ల నిర్మాణం కోసం 72 సెంట్ల భూమిని త్వరగా సేకరించి పనులు ప్రారంభించేలా చూడాలని కోరారు.

2. తాగునీటి ఎద్దడి నివారణ మరియు మౌలిక వసతులు

👉 కోరుకొండ, రాజానగరం మరియు సీతానగరం మండలాల్లో వేసవి కాలంలో తాగునీటి సమస్యలు రాకుండా కొత్త బోరు బావులు, ఆర్‌ఓ (RO) ప్లాంట్లు మరియు పైప్‌లైన్ల మరమ్మతుల కోసం రూ. 209.50 లక్షలు (రూ. 2.09 కోట్లు) మంజూరు చేయాలని కోరారు.

👉 సీతానగరం మండలం పురుషోత్తపట్నంలో ఉంటూ సుమారు 3.5 లక్షల జనాభాకు దాహార్తి తీరుస్తున్న శ్రీ సత్యసాయి తాగునీటి పథకానికి తక్షణ మరమ్మతులు చేపట్టేందుకు రూ. 1 కోటి రూపాయలు కేటాయించి శాశ్వత ప్రాతిపదికన పనిచేసేలా చూడాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

3. రహదారుల విస్తరణ మరియు భవనాల మరమ్మతులు

👉 చారిత్రాత్మక కోరుకొండ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి వెళ్లే భక్తుల రద్దీ దృష్ట్యా కోరుకొండ – నాగంపల్లి రోడ్డును విస్తరించేందుకు రూ. 3.60 కోట్లు (రూ. 360 లక్షలు) నిధులు మంజూరు చేయాలని కోరారు.

👉 శ్రీరాంపురం – పోలీస్ క్వార్టర్స్ రోడ్డును డబుల్ లేన్‌గా మార్చడానికి రూ. 6.50 కోట్లు (రూ. 650 లక్షలు) నిధులతో పాటు, దివాన్ చెరువు రిజర్వ్ ఫారెస్ట్ మీదుగా వెళ్తున్నందున 0.67 హెక్టార్ల అటవీ భూమిని కేటాయించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

👉 శిథిలావస్థకు చేరిన సీతానగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన బలోపేతం మరియు మరమ్మతుల నిమిత్తం రూ. 27.50 లక్షల నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

4. కోరుకొండ ఆలయాన్ని TTD దత్తత తీసుకోవడం

👉 ఎంతో పురాతనమైన మరియు పవిత్రమైన కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ ప్రాముఖ్యతను గుర్తించి, రాబోయే 2027 గోదావరి పుష్కరాల దృష్ట్యా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) చేత దత్తత తీసుకునేలా చర్యలు వేగవంతం చేయాలని కోరారు.

👉NDB రోడ్ పనులకు నిధులు మంజూరు చేయండి
రాజానగరం నియోజకవర్గంలో NDB నిధుల తో చేపట్టిన మూడు ముఖ్యమైన రహదారి పనులు 1.కాపవరం-ముగల్లా రోడ్ .చినకొండేపూడి నుండి చీపురుపల్లి రోడ్ 3.రాజానగరం నుండి గాదరాడ రోడ్ పనులు చేపట్టాలనీ కోరడం జరిగింది.

రాజానగరం నియోజకవర్గ సమస్యలపై గౌరవ ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి, తగిన చర్యలు తీసుకుంటారని ఎమ్మెల్యే శ్రీ బత్తుల బలరామకృష్ణ కి హామీ ఇవ్వడం జరిగింది.

2,804 Views

You may also like

Leave a Comment