Home ట్రెండింగ్ ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే.. | ఇళ్ల స్థలాలు లేని వారికి.. అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్‌లు ఇస్తానని రేవంత్‌ ప్రభుత్వం శుభవార్త చెప్పింది – VRM MEDIA

ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే.. | ఇళ్ల స్థలాలు లేని వారికి.. అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్‌లు ఇస్తానని రేవంత్‌ ప్రభుత్వం శుభవార్త చెప్పింది – VRM MEDIA

by VRM Media
0 comments
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే.. | ఇళ్ల స్థలాలు లేని వారికి.. అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్‌లు ఇస్తానని రేవంత్‌ ప్రభుత్వం శుభవార్త చెప్పింది


తెలంగాణ

oi-డాక్టర్ వీణా శ్రీనివాస్

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం తెలంగాణ రాష్ట్రంలో నీరుపేదల సొంతింటి కలను నెరవేర్చే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా సొంత స్థలం ఉన్న అర్హులకు మూడు విడతలలో ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందించి, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి తోడ్పాటునందిస్తుంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతుంది.

ఇళ్ళు, ఇళ్ళ స్థలాలు లేని వారికి శుభవార్త

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్చి 31వ తేదీ నాటికి దాదాపు 1.12 లక్షల ఇళ్ల గృహప్రవేశాలు చేయాలనే లక్ష్యం పెట్టుకుంది. అంతేకాదు జూన్ నాటికి మరో లక్ష ఇళ్లను పూర్తి చేసిన గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఇళ్ల స్థలం ఉన్నవాళ్లకు ఇందిరమ్మ ఇల్లు, ఇళ్ల స్థలం లేనివారికి నిర్మించి ఫ్లాట్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇళ్ల స్థలాలు లేని వారికి అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్లు ఇస్తామని రేవంత్‌ ప్రభుత్వం శుభవార్త చెప్పింది

బహుళ అంతస్తుల నిర్మాణాల ప్లాన్

ఈ రాష్ట్ర హౌసింగ్ శాఖ అధికారులు ఇప్పటికే అనేక ప్రణాళికలు రూపొందించారు. ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఎల్ 2 కేటగిరి దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించింది. ఎల్2 అంటే స్థలం లేని నిరుపేదలు, ఈ వర్గానికి భూములు కేటాయించి ఇల్లు నిర్మించి ఇచ్చే బదులు, బహుళ అంతస్తుల నిర్మాణాలు నిర్మించి వారికి ప్లాట్లను కేటాయించాలని నిర్ణయించిన రేవంత్ ప్రభుత్వం అందుకు ప్లాన్ చేస్తోంది.

హైదరాబాద్ లో మాత్రమే కాదు అన్ని జిల్లా కేంద్రాలలో కూడా

హైదరాబాద్‌లో మాత్రమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు అనుకూలమైన ప్రాంతాలను ఎంపిక చేసి నిర్మాణం చేస్తున్నారు. వీటిని ప్రధానంగా మూడు, ఐదు, తొమ్మిది అంతస్తుల ఎత్తులో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక్కో డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ 415 చదరపు అడుగుల విస్తీర్ణం 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది.

బహుళ అంతస్తుల భవనాల ప్లాన్ ఇలా

ఒక ఏకరం విస్తీర్ణంలో నిర్మాణం చేపట్టే జి ప్లస్ త్రీలో 120 నుండి 150ఫ్లాట్లు, స్టిల్ట్+5 అపార్ట్‌మెంట్‌లో 150-200ఫ్లాట్లు, అలాగే స్టిల్+9 అంతస్తులలో 200-220ఫ్లాట్‌లను నిర్మించడానికి ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఈ బహుళ అంతస్తుల భవనాల నిర్మాణానికి హైదరాబాద్‌లో ఇప్పటికే విస్తృత దృష్టి సారించారు. ఇందులో భాగంగా మురికివాడలు, వాంబే, ఈడబ్ల్యూఎస్ పథకాల కింద నిర్మించవలసిన శిథిలావస్థకు చేరిన 12 కాలనీలను అధికారులు గుర్తించారు.

హైదరాబాద్ పరిధిలో ఈ ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు

హైదరాబాద్‌కు సమీపంలోని మేడ్చల్ జిల్లాలో కూడా 28 ప్రభుత్వ భూములను పరిశీలించారు. సంగారెడ్డి జిల్లా పరిధిలో ఇక్రిశాట్ వద్ద 5 ఎకరాలు, మార్క్స్ నగర్ వద్ద 6 ఎకరాలు, లక్డారంలో 130 ఎకరాలు ఇలా పలు ప్రాంతాలను ఎంపిక చేశారు. ఈ స్థలాల్లో అపార్ట్‌మెంట్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే ఉమ్మడి జిల్లాలోనూ అమలు చేయడానికి ప్రభుత్వం ఆలోచిస్తోంది.

ఈ జిల్లాల్లోనూ అపార్ట్ మెంట్ ల నిర్మాణానికి ప్లాన్

నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, ఆదిలాబాద్ వంటి ముఖ్యమైన జిల్లా కేంద్రాల్లోనూ ఈ తరహా అపార్ట్‌మెంట్‌లు నిర్మించి పేదలకు గృహాలను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. స్టిల్ట్ పద్ధతిలో నిర్మించే బహుళ అంతస్తుల భవనాల్లో గ్రౌండ్ ఫ్లోర్‌లో నివాసాలకు అనుమతి ఉండదు. ఈ అంతస్తులో కేవలం పార్కింగ్, వాణిజ్య సముదాయాల గదులు మాత్రమే కేటాయించబడతాయి.

జిల్లాలలో స్థలాల గుర్తింపు వేగం

జీ+3 విధానంలో నిర్మించే అపార్ట్‌మెంట్లకు మాత్రం గ్రౌండ్ ఫ్లోర్‌లో నివాసయోగ్యమైన గృహాలకు అనుమతి ఉంటుంది. ప్రస్తుత ఈ బహుళ అంతస్తుల భవనాలను నిర్మించడానికి రాష్ట్రవ్యాప్తంగా అవసరమైన స్థలాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లా కేంద్రాలలో అనువైన ప్రభుత్వ స్థలాలను గుర్తించి నివేదికలు సమర్పించాలని ఇప్పటికే ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. మొత్తానికి ఎల్ టు కేటగిరి కింద బహుళ అంతస్తుల భవనాలను కూడా నిర్మించి రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలు లేకుండా చూడాలని ప్రయత్నం చేసింది.

2,803 Views

You may also like

Leave a Comment