
ఆంధ్ర ప్రదేశ్
oi-డాక్టర్ వీణా శ్రీనివాస్
కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో జాతీయ అభివృద్ధి పైన ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిసింది. ఈ ప్రణాళికనే జాతీయ రహదారిని ఏపీలో ప్రయాణ సౌకర్యాలను అభివృద్ధి చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలను, పట్టణాలను కలుపుతూ ఇది సాగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నరసన్నపేట నుంచి పాతపట్నం మీదుగా ఒరిస్సాని కలిపే జాతీయ రహదారి 326a ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలకు రవాణా సౌకర్యాన్ని మెరుగుపరుస్తుంది.
జాతీయరహదారి 326A పైన కీలక అప్డేట్
326a పైన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు తాజాగా శుభవార్త చెప్పారు. నరసన్నపేట పాతపట్నం మీదుగా ఒరిస్సాను కలిపే జాతీయరహదారి 326Aలో పాతపట్నం వద్ద నిర్మాణంలో ఉన్న రెండు లైన్ల రోడ్ ఓవర్ బ్రిడ్జ్ కోసం అదనంగా జాతీయ కార్పొరేట్ సంస్థ నుండి 15కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. దీనికి సంబంధించిన విడుదల జాతీయ సంస్థ నుండి అయ్యాయి.

ROB ప్రాజెక్టు విషయంలో ఇబ్బందులపై మాట్లాడిన కేంద్రమంత్రి
ఈ ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురాగలమని స్పష్టం చేశారు. నాలుగు శతాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి ఆలయ నిర్మాణం జరుగుతున్న ROB ప్రాజెక్టు విషయంలో ముందుగా ప్రతిపాదించిన దశలో కొన్ని ఇబ్బందులు ఉన్నట్టు స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చినట్లు రామ్మోహన్ నాయుడు తెలిపారు.
వయాడక్ట్ నిర్మాణం చేపట్టాలనే నిర్ణయం తీసుకున్నట్టు తెలిపిన కేంద్రమంత్రి
ఆలయ ప్రాంతంలో రాకపోకలు, భక్తులకు నుండే ఆలయ దర్శనం, అయిదేళ్ళకు ఒకసారి జరిగే మహాజాతర ఉత్సవాల్లో కొన్ని అవాంతరాలు ఎదురయ్యే అవకాశం ఉందని గతంలోనే కేంద్ర మంత్రి చెంతకు సమస్య చేరింది. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజల అభిప్రాయాలను గౌరవించి, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల భక్తుల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని, ముందుగా ప్రతిపాదించిన రిటైనింగ్ వాల్ స్థానంలో వయాడక్ట్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయాన్ని తీసుకున్నట్టు రామ్మోహన్ నాయుడు తెలిపారు.
డిజైన్ మార్పుకు కేంద్రం ఆమోదం, అదనపు నిధులు
ఈ జాతీయ జాతీయ సంస్థకు, కేంద్ర రవాణా శాఖామంత్రి నితిన్ గడ్కరి దృష్టిలో ఉంచి నేడు పరిష్కార దిశగా నిర్ణయం తీసుకున్నామని అన్నారు. డిజైన్ మార్పునకు అంగీకారం తెలపడంతో పాటు, అదనపు నిధులు మంజూరుకు సంబంధించి కూడా ఉత్తర్వులు విడుదల అయ్యాయని రామ్మోహన్ నాయుడు తెలిపారు.
త్వరలోనే ఆర్వోబీ పూర్తి
ఈ మార్పు కేవలం నిర్మాణశైలిలో జరిగిన మార్పు కాదని, మన సంస్కృతి, సంప్రదాయాలు, భక్తుల విశ్వాసానికి ప్రభుత్వం ఇస్తున్న గౌరవం అని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ప్రజల భావోద్వేగాలను గౌరవిస్తూ అభివృద్ధి చేయడం మా సంకల్పమని అన్నారు. అన్ని అనుమానాలు తొలగి అదనపు నిధులు లభించిన నేపధ్యంలో అతి త్వరలోనే ఆర్వోబిని పూర్తి చేసిన కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు.