Home Uncategorized జర్నలిస్టుల పట్ల పాలకుల వివక్ష-పోరాటం లేనిదే సమస్యలు పరిష్కారం కావు__టీడబ్ల్యూజేఎఫ్ ( హెచ్-2843) వ్యవస్థాపక అధ్యక్షులు మామిడి సోమయ్య

జర్నలిస్టుల పట్ల పాలకుల వివక్ష-పోరాటం లేనిదే సమస్యలు పరిష్కారం కావు__టీడబ్ల్యూజేఎఫ్ ( హెచ్-2843) వ్యవస్థాపక అధ్యక్షులు మామిడి సోమయ్య

by VRM Media
0 comments

Vrm media ప్రతినిధి ఖమ్మం

ఖమ్మం, ఏప్రిల్ 04

ఖమ్మం:-జర్నలిస్టుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం,పాలకులు చూపుతున్న వివక్ష,నిర్లక్ష్య వైఖరిని విడనాడి సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టిడబ్ల్యుజేఎఫ్) వ్యవస్థాపక అధ్యక్షులు, రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య డిమాండ్ చేశారు. శనివారం ఖమ్మం జిల్లా కేంద్రంలో టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, రాష్ట్రంలో జర్నలిస్టుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండి పని చేస్తున్న పాత్రికేయులు తమ సమస్యలపై రోడ్డెక్కి ఆందోళన చేయాల్సిన దుస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాల గడిచినా, ఇంతవరకు జర్నలిస్టులకు సంబంధించిన ఏ ఒక్క సమస్యను పరిష్కరించలేదని, కనీసం కొత్త అక్రెడిటేషన్ కార్డులు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉందని ఆయన ధ్వజమెత్తారు. అక్రెడిటేషన్ కార్డుల్లో కోత లేకుండా అర్హులైన జర్నలిస్టులందరికీ కొత్త అక్రెడిటేషన్లు ఇవ్వాలని, అదేవిధంగా ప్రభుత్వం జర్నలిస్టుల కోసం ప్రకటించిన మ్యానిఫెస్టో అంశాలను అమలు చేయాలని మామిడి సోమయ్య డిమాండ్ చేశారు. జర్నలిస్టుల పట్ల గతంలో ఎన్నడూ లేని వివక్ష కొనసాగుతుందని, అక్రిడిటేషన్‌ కార్డుల పంపిణీ ప్రక్రియను గందరగోళం చేసి జర్నలిస్టులను ఆందోళన వైపుకు నెట్టారని అన్నారు. ప్రభుత్వ వివక్ష, నిర్లక్ష్య వైఖరి ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల ఆందోళనను ఉధృతం చేయాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఖమ్మం జిల్లాలో చాలా ఏళ్ళుగా పెండింగ్ లో ఉన్న ఇళ్ళస్థలాల సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లాలో టీడబ్ల్యూజేఎఫ్ ( హెచ్-2843) నాయకులు జర్నలిస్టుల సమస్యల, సంక్షేమం వైపు దృష్టి సారించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ సంఘాన్ని బలోపేతం చేయాలని ఆయన సూచించారు. జిల్లా ఉపాధ్యక్షుడు సూర్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో టీడబ్ల్యూజేఎఫ్ (హెచ్-2843)
హైదరాబాద్ జిల్లా కన్వీనర్ వి. రవికుమార్, ఖమ్మం జిల్లా కార్యదర్శి నానబాల రామకృష్ణ, కోశాధికారి నగేష్,లీగల్ అడ్వయిజర్ శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.
__ ఈ జనరల్ బాడీ సమావేశంలో ఈ రోజున కొత్త కమిటీ ఎన్నిక
ఖమ్మం జిల్లా నూతన అధ్యక్ష, కార్యదర్శుల ఎన్నిక
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీ.డబ్ల్యూ.జే.ఎఫ్) ఖమ్మం జిల్లా నూతన అధ్యక్షుడుగా
నానబాల రామకృష్ణ ,
ప్రధాన కార్యదర్శి గా అర్వపల్లి నగేష్, కోశాధికారి గా వేములకొండ రమేష్ కుమార్ లను తో పాటు పూర్తి స్థాయి కమిటీ ఎన్నిక జరిగింది. ఈ జనరల్ బాడీ సమావేశంలో జిల్లా టి.బి.జే.ఎ అధ్యక్షుడిగా వందనపు సామ్రాట్ గుప్తా, కార్యదర్శి కాసోజుశ్రీధర్ ,
టీబీజేఏ ఖమ్మం నగర అధ్యక్షుడు వెలుగోటి వెంకట్ ,,,
కార్యదర్శి నల్ల రాకేష్ రెడ్డి,,
టిడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం నగర అధ్యక్షుడు గంటేల కుమార్ ,,
కార్యదర్శి కప్పల మధు,,,
ఖమ్మం ప్రెస్ క్లబ్
అధ్యక్షుడు ఆన్తోటి శ్రీనివాస్
కార్యదర్శి మల్లెల శిల్ప
ఫోటోగ్రాఫర్ అధ్యక్షుడు
అమరబోయిన ఉపేందర్ కార్యదర్శి చెరుకుమల్లి సతీష్ ,మరియు జిల్లా సంయుక్త కార్యదర్శి కుంభం రవికుమార్, ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు, నాగకృష్ణ, ఈసీ మెంబర్స్
మామిడాల వీరబాబు, మహమ్మద్ షకిల్ పాషా, లింగాల రామ్మూర్తి, ఓరుగంటి కిరణ్, ఎలిశెట్టి రామకృష్ణ బాబు, కల్లేపల్లి లింగయ్య, స్వాతి, శివ, జగదీష్
గౌరవ ప్రధాన సలహాదారుడు కొదుమూరి జగన్నాధ రావు తదితరులు పాల్గొన్నారు.

2,807 Views

You may also like

Leave a Comment