Home ట్రెండింగ్ Tamil Nadu Survey: తమిళ ఓటర్ల తీర్పు క్లియర్-ఇన్ సైడ్ ఎలక్షన్ సర్వేలో..! | తమిళనాడు ఎన్నికలు 2026: ఇన్‌సైడ్ ఎలక్షన్ సర్వే ఏ కూటమిని థ్రెడ్‌తో వేలాడుతున్నదని అడుగుతుంది – VRM MEDIA

Tamil Nadu Survey: తమిళ ఓటర్ల తీర్పు క్లియర్-ఇన్ సైడ్ ఎలక్షన్ సర్వేలో..! | తమిళనాడు ఎన్నికలు 2026: ఇన్‌సైడ్ ఎలక్షన్ సర్వే ఏ కూటమిని థ్రెడ్‌తో వేలాడుతున్నదని అడుగుతుంది – VRM MEDIA

by VRM Media
0 comments
Tamil Nadu Survey: తమిళ ఓటర్ల తీర్పు క్లియర్-ఇన్ సైడ్ ఎలక్షన్ సర్వేలో..! | తమిళనాడు ఎన్నికలు 2026: ఇన్‌సైడ్ ఎలక్షన్ సర్వే ఏ కూటమిని థ్రెడ్‌తో వేలాడుతున్నదని అడుగుతుంది


భారతదేశం

ఓయ్-సయ్యద్ అహ్మద్

తమిళనాడులో ఈ నెల 23న అసెంబ్లీ ఎన్నికలు (తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు 2026) జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో మరోసారి డీఎంకే, అన్నాడీఎంకే మధ్య గట్టి పోటీ. అదే సమయంలో హీరో విజయ్ పార్టీ టీవీకే కూడా అదృష్టం పరీక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అలాగే ఉత్తరాదిలో వరుసగా విజయాలు సాధిస్తున్న బీజేపీకి తమిళనాడులో గెలుపు అత్యవసరంగా మారింది. ఈ నేపథ్యంలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై అందరి దృష్టీ ఉంది. దీంతో తమిళనాడు ఓటర్ల నాడి కోసం పలు సర్వే (సర్వే) సంస్థలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.

ఇదే తాజా ఇన్ సైడ్ ఎలక్షన్ అనే సంస్థ చేపట్టిన సర్వే ఫలితాలు వెల్లడయ్యాయి. ఇందులో తమిళనాడులో మరోసారి హోరాహోరీ పోరు నెలకున్నా ఫలితాలు ఏకపక్షంగానే ఉండబోతున్నట్లు తేలిపోయింది. అధికార డీఎంకేకు ఓటర్లు మరోసారి అధికారం కట్టబెట్టేందుకు సిద్దంగా ఉన్నట్లు ఈ సర్వే తేల్చింది. విపక్ష అన్నాడీఎంకే-బీజేపీ కూటమి మరోసారి అధికారానికి ఆమడ దూరంలో ఉండిపోతున్నట్లు నిర్ధారణ అయింది. అలాగే విజయ్ ప్రభావం కూడా లేదని తేలిపోయింది.

తమిళనాడు ఎలక్షన్ 2026 ఇన్‌సైడ్ ఎలక్షన్ సర్వే ఏ కూటమిని థ్రెడ్‌తో వేలాడుతున్నదని అడుగుతుంది

234 సీట్లున్న తమిళనాడు అసెంబ్లీలో ఈసారి డీఎంకేకు 159-165 సీట్లు లభించబోతున్నట్లు ఇన్ సైడ్ ఎలక్షన్ సంస్థ తమ సర్వే ఫలితాల్లో వెల్లడించింది. అలాగే అన్నాడీఎంకే-బీజేపీ కూటమికి 64-70 సీట్లు వచ్చే అవకాశం ఉందని తేలింది. విజయ్ పార్టీకే కేవలం 4-6 సీట్లతో సరిపెట్టుకోక తప్పదని ఈ సర్వేలో పాల్గొన్న ఓటర్లు తేల్చేశారు. అలాగే డీఎంకే కూటమికి ఈసారి 44 శాతం మంది ఓటర్ల మద్దతు లభిస్తోందని, అన్నాడీఎంకే కూటమికి కేవలం 33 శాతం మంది ఓటర్లే ​​మద్దతిస్తున్నట్లు తేలింది. విజయ్ పార్టీ టీవీకే 18 శాతం మంది ఓటర్లు అండగా నిలుస్తున్నారు. ఎన్టీకేకు 3 శాతం, ఇతరులకు 2 శాతం ఓటర్లు మద్దతిస్తున్నారు.

తమిళనాడు ఎలక్షన్ 2026 ఇన్‌సైడ్ ఎలక్షన్ సర్వే ఏ కూటమిని థ్రెడ్‌తో వేలాడుతున్నదని అడుగుతుంది

ఈ సర్వేలో ముఖ్యమంత్రిగా ఎవరికి ఓటేస్తారన్న ప్రశ్నకు ఎంకే స్టాలిన్‌కు 44 శాతం మంది, పళనిస్వామికి 28 శాతం మంది, విజయ్‌కు 24 శాతం మంది, సీమన్‌కు 3 శాతం మంది, ఇతరులకు ఒక్క శాతం మంది ఓటర్లు మద్దతిచ్చారు. రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వ పాలన ఎలా ఉందన్న ప్రశ్నకు 30 శాతం ఓటర్లు చాలా బాగుందని, 20 శాతం మంది ఓటర్లు బాగుందని, 25 శాతం యావరేజ్ అని, 15 శాతం మంది బాగోలేదని, 10 శాతం మంది అస్సలు బాగోలేదని తేల్చిచెప్పారు. డీఎంకే ప్రభుత్వం కొనసాగాలా అన్న ప్రశ్నకు 55 శాతం మంది అవునని, మార్పు 25 శాతం మంది, ఏమీ చెప్పలేం అని మరో 20 శాతం మంది చెప్పారు.



2,802 Views

You may also like

Leave a Comment