
ఆంధ్ర ప్రదేశ్
ఓయ్-బొమ్మ శివకుమార్
ఏపీ రాజధానిగా అమరావతికి కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈమెరకు చట్టబద్ధత కల్పించింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సంతకం తర్వాత గెజిట్‌ను విడుదల చేసింది. అమరావతి గెజిట్‌ను కేంద్ర న్యాయశాఖ విడుదల చేసింది. 2024 జూన్ 2 నుంచి ఇది అమలులోకి వస్తుందని ప్రకటనలో కనిపించింది.
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఇక అమరావతి.. ఈ మేరకు కేంద్రం ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. తాజాగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సంతకం తర్వాత గెజిట్‌ను విడుదల చేసింది. అంతకుముందు అమరావతి చట్టబద్ధత బిల్లు రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. అయితే పరిశీలన, నిపుణులతో సంప్రదింపుల అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. రాష్ట్రపతి ఆమోదం అనంతరం ఈ బిల్లు చట్టరూపం దాల్చింది. ఇక ఏపీ పునర్విభజన చట్ట సవరణ 2026 బిల్లు పార్లమెంట్‌లోని ఉభయ సభలు ఇటీవల ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
ఇక ఇటీవల అమరావతి చట్టబద్ధత బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత అమరావతి ప్రాంత ప్రజలు సంబరాలు చేసుకున్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు అందరూ సంబరాలు జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. మంత్రి లోకేశ్.. ప్రజా రాజధాని అమరావతికి చట్టబద్ధత వచ్చినరోజు సాయంత్రం 7 గంటలకు ప్రతి ఇంటి ముందు దీపాలు వెలిగించి ఈ విజయాన్ని జరుపుకుంటామని.

మంత్రి లోకేశ్ పిలుపుతో ప్రజలంతా ఇళ్ల ముందు దీపాలు వెలిగించి ర్యాలీలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల సంబరాల్లో భాగంగా ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అని నినాదాలు చేశారు. కేక్‌లు కట్ చేసి బాణసంచా పేల్చారు. విజయోత్సవ సంబరాల్లో కూటమి నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. మరోవైపు వైఎస్సార్సీపీ అధినేత జగన్ మాత్రం.. మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు ప్రాంతంలో ‘మావిగన్’ పేరుతో రాజధాని ఏర్పాటు చేయాలని సూచించిన విషయం తెలిసిందే.