
ఆంధ్ర ప్రదేశ్
ఓయ్-సాయి చైతన్య
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు, బదిలీలకు సంబం ధించి ప్రస్తుతం ఉన్న విధానాల్లో మార్పులు రానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా గజెట్ జారీ చేయనుంది. రాష్ట్రంలో 26 జిల్లాలకు సంబంధించి కేంద్రం జారీ చేసిన ‘ఏపీ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ ఆర్డర్-2025’ గెజిట్‌కు అనుగుణంగా రూపకల్పన చేస్తున్నారు. ఈ నెల 10న జరిగే మంత్రివర్గ సమావేశంలో.. తుది ఆమోద ముద్ర వేయనున్నారు.
ఏపీలో 26 జిల్లాలకు సంబంధించి కేంద్రం జారీ చేసిన ‘ఏపీ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ ఆర్డర్- 025’ గెజిట్‌కు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదలకు కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఏపీలోని 26 జిల్లాలు, ఆరు జోన్లు, రెండు మల్టీ జోన్లు అమల్లోకి రానున్నాయి. ఉద్యోగ నియామకాలు, బదిలీలకు ఇదే ప్రామాణికం కానున్నాయి. ఇప్పటికే ఈ ప్రతిపాదనలకు జీఏడీ మంత్రివర్గ ఆమోదం కోసం పంపింది. ఈ నెల 10న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఆమోద ముద్ర వేసిన తరువాత గెజిట్ జారీ చేయడానికి అనుమతి. నియామకాలు, బదీలలకు సంబంధించి ప్రస్తుతం స్థానికత, స్థానిక కోటా జిల్లా స్థాయి నియామకాల్లో 80:20, జోనల్ స్థాయిలో 70:30గా ఉంది. ఇప్పటి వరకు రాష్ట్ర స్థాయి పోస్టులుగా ఉన్నవి మల్టీజోన్ పోస్టులుగా మారనున్నాయి. అదే విధంగా నేరుగా చేపట్టనున్న అన్ని కేటగిరీ ఉద్యోగాల్లో స్థానికులకు 95 శాతం.. స్థానికులకు 5 శాతం కోటగా ఖరారు చేస్తారు. కొత్తగా ఏర్పడిన రెండు జిల్లాలతో కలిపి 28 జిల్లాలకు కొత్త గెజిట్ నోటిఫికేషన్ జారీ కోసం కేంద్రానికి ప్రతిపాదన పంపబడుతుంది.

జోనల్ వ్యవస్థ ఖరారు.. మంత్రివర్గంలో ఆమోదం
అదే విధంగా జాబ్ కేలండర్‌లో ఉద్యోగాల నోటిఫికేషన్ నాటికి 28 జిల్లాల గెజిట్ నోటిఫికేషన్ వస్తే దాని ప్రకారమే నియామకాలు చేపట్టనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికే ఎన్ జారీ చేస్తే ఇప్పటి వరకు ఉన్న పబ్లిక్ ఎంప్లాయిమెంట్ ఆర్డర్-1975 రద్దు. జూనియర్ అసిస్టెంట్, దీని కంటే దిగువన ఉండే పోస్టులను జిల్లా క్యాడర్‌గా పరిగణించాలని స్థాయి నిర్ణయం తీసుకున్నారు. ఇక.. జూనియర్ అసిస్టెంట్‌కు పైన సూపరింటెండెంట్, మొదటిస్థాయి గెజిటెడ్ పోస్టులను జోనల్ పోస్టులుగా మారతాయి. అదే విధంగా సూపరింటెండెంట్, మొదటిస్థాయి గెజిటెడ్ పోస్టు కేటగిరీకిపైన డిప్యూటీ కలెక్టర్, దీనికి సమానమైన కేటగిరీలను మల్టీ జోన్ పోస్టులుగా పరిగణిస్తారు. సెకండరీ డేట్ టీచర్లు, స్కూల్ అసిస్టెంట్లు, -2 ప్రధానోపాధ్యాయ పోస్టులు జిల్లా క్యాడర్‌లోనే ఉంటాయి. స్థానికత విషయంలో ఏదైనా పోస్టుకు నిర్ణయించిన విద్యార్హత నుంచి ఏడేళ్లు ఎక్కడ చదివారో పరిశీలించి అందులో నాలుగేళ్లు చదివిన ప్రాంతాన్నే స్థానికంగా నిర్ధారిస్తారు. విద్యార్హతలు లేని పోస్టులకైతే నివాస ప్రాంతాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు. ఇక.. మల్టీ జోన్, జోన్ ల పరిధులను ఖరారు చేసారు. వీనిటన్ గురించి కేబినెట్‌లో చర్చించండి.. తుది నిర్ణయం తీసుకోనున్నారు.