Home ట్రెండింగ్ మా ఫింగర్స్ ట్రిగ్గర్ పైనే ఉన్నా.. ఏ క్షణమైనా : ఇరాన్ సంచలన వార్నింగ్ | ఇరాన్ పెజెష్కియన్ లెబనాన్‌పై దాడులపై ఇజ్రాయెల్‌కు బలమైన హెచ్చరిక జారీ చేసింది ఇరాన్ ఇప్పుడు ఇజ్రాయెల్‌కు హెచ్చరిక – VRM MEDIA

మా ఫింగర్స్ ట్రిగ్గర్ పైనే ఉన్నా.. ఏ క్షణమైనా : ఇరాన్ సంచలన వార్నింగ్ | ఇరాన్ పెజెష్కియన్ లెబనాన్‌పై దాడులపై ఇజ్రాయెల్‌కు బలమైన హెచ్చరిక జారీ చేసింది ఇరాన్ ఇప్పుడు ఇజ్రాయెల్‌కు హెచ్చరిక – VRM MEDIA

by VRM Media
0 comments
మా ఫింగర్స్ ట్రిగ్గర్ పైనే ఉన్నా.. ఏ క్షణమైనా : ఇరాన్ సంచలన వార్నింగ్ | ఇరాన్ పెజెష్కియన్ లెబనాన్‌పై దాడులపై ఇజ్రాయెల్‌కు బలమైన హెచ్చరిక జారీ చేసింది ఇరాన్ ఇప్పుడు ఇజ్రాయెల్‌కు హెచ్చరిక


అంతర్జాతీయ

ఓయ్-బొమ్మ శివకుమార్

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గేలా కనిపించడం లేదు. ఇరాన్- అమెరికా మధ్య కాల్పుల విరమణ జరిగినప్పటికీ అక్కడి పరిస్థితి యుద్ధ వాతావరణాన్నే తలపిస్తోంది. లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులు ముమ్మరం చేయడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. అయితే లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులను తీవ్రంగా ఖండించింది. ఈ దాడులు సీజ్ ఫైర్ ఉల్లంఘన కిందకు వస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సంచలన వార్నింగ్ ఇచ్చారు. తమ ఫింగర్స్ ట్రిగ్గర్ పైనే. లెబనాన్ ను ఒంటరిగా వదిలేయమని తేల్చి చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు.

“లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులు జరుగుతున్నాయి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచినట్టే. ఇది ఓ క్రూరమైన చర్యకు నాంది. భవిష్యత్తులో జరగనున్న చర్చలకు ఈ దాడులు జరగడానికి వీలు కల్పిస్తుంది. ఇరు దేశాల మధ్య చర్చలకు ఈ దాడులు అడ్డంగా మారాయి. ఇక చర్చలు జరగాలంటే ఏం చేయాలి. మా ఫింగర్స్ ట్రిగ్గర్ పైనే ఉంది.” వార్నింగ్ ఇచ్చారు.

అలాగే ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ భాగేర్ సైతం ఇజ్రాయెల్ కు వార్నింగ్ ఇచ్చారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే పర్యవసానాలు దారుణంగా ఉంటాయని. తమ సరిహద్దు దేశాలను కాపాడుకోవడంలో ఇరాన్ పాత్ర చాలా ఉందని తెలుస్తోంది. సీజ్ ఫైర్ కిందకు లెబనాన్ కూడా వస్తుందని చెప్పారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా మహమ్మద్ భాగేర్ పోస్టు పెట్టారు.

ఇక లెబనాన్ పై ఇజ్రాయెల్ వరుసబెట్టి దాడులు చేస్తోంది. తాజాగా గురువారం చేపట్టిన దాడుల్లో లెబనాన్‌లో దాదాపు 250 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు మాట్లాడుతూ.. హెజ్ బొల్లాపై మిలిటరీ దాడులు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. హెజ్ బొల్లాపై కచ్చితత్వమైన మిలిటరీ దాడులను ఇజ్రాయెల్ సైన్యం చేస్తుందని తెలిపారు. తాము ఒకటేనని.. ఎవరైతే ఇజ్రాయెల్ ప్రజలకు వ్యతిరేకంగా ఉంటారో వారిపై దాడులు జరుగుతున్నాయని తేల్చి చెప్పారు. అలాగే ఇజ్రాయెల్ ఎప్పుడనుకుంటే అప్పుడు హెజ్ బొల్లాపై దాడులు జరుగుతున్నాయని స్పష్టం చేశారు.

లెబనాన్‌పై దాడులపై ఇరాన్ పెజెష్కియన్ ఇజ్రాయెల్‌కు బలమైన హెచ్చరిక జారీ చేసింది ఇరాన్ ఇప్పుడు ఇజ్రాయెల్‌కు హెచ్చరిక

ఇక ఇరాన్- అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన వెంటనే లెబనాన్ పై ఇజ్రాయెల్ సైన్యం భీకర దాడులు చేసింది. వందలాది ఫైటర్ జెట్స్ తో లెబనాన్ పై విరుచుకుపడింది. కేవలం 10 నిమిషాల్లోనే 100 కు పైగా లక్ష్యాలను ఛేదించింది.. ఇది హెజ్ బొల్లాకు ఊహించని దెబ్బ అని ఇజ్రాయెల్ సైన్యం స్పష్టం చేసింది. ఈ దాడుల్లో లెబనాన్‌లో దాదాపు 200 మందికి పైగా మరణించినట్లు సమాచారం.



2,802 Views

You may also like

Leave a Comment