
అంతర్జాతీయ
ఓయ్-చంద్రశేఖర్ రావు
అమెరికా, ఇరాన్ మధ్య పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో చర్చలు జరుగుతున్న కీలక సమయంలో డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అనూహ్యంగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్‌లోని ప్రస్తుత, మాజీ సీనియర్ అధికారుల బంధువుల గ్రీన్ కార్డ్‌లను రద్దు చేసింది. వారిని అరెస్టు చేసింది. కటకటాల వెనక్కి నెట్టింది. అమెరికాలో శాశ్వత నివాసానికి అనుమతి గ్రీన్ కార్డులను రద్దు చేయడం పట్ల అటు ఇరాన్ ఘాటుగా స్పందించింది.
ఈ దేశాల మధ్య ఉద్రిక్తంగా ఉన్న రెండు ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పరిణామం చోటు చేసుకుంది.. మరింత ఆజ్యం పోసినట్టయింది. విదేశీ పౌరులు తమ దేశంలో శాశ్వతంగా నివసించడానికి, చట్టబద్ధంగా పని చేయడానికి ఉద్దేశించారు ఈ గ్రీన్ కార్డ్. అమెరికా పౌరసత్వం లేనప్పటికీ- దాని వల్ల కలిగే ప్రయోజనాలు దాదాపుగా గ్రీన్ కార్డ్ హోల్డర్లకు అందుతాయి. దీర్ఘకాల నివాసానికి పూర్తి చట్టబద్ధతను కల్పిస్తుంది.

ఈసారి అమెరికా విదేశాంగ శాఖ ముగ్గురు అధికారుల గ్రీన్ కార్డ్‌లను రద్దు చేసింది. వీరు ఇరాన్లో జన్మించారు. ఈ ముగ్గురిలో లాస్ ఏంజిల్స్ శివార్లలో ఓ స్కూల్ లో సైకాలజీ ప్రొఫెసర్ గా పని చేస్తోన్న సయ్యద్ ఈసా హష్మీ కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయనతో పాటు భార్య, కుమారుడి గ్రీన్ కార్డ్‌లు కూడా రద్దయ్యాయి.
సయ్యద్ హష్మీ, ఆయన కుటుంబానికి గతంలో కేటాయించిన గ్రీన్ కార్డులను రద్దు చేయడం ప్రధాన కారణం.. తల్లి మసూమ్ ఎబ్టెకార్. 1979లో అమెరికా రాయబార కార్యాలయంపై దాడి చేసిన వారి తరపున ఆమె ప్రతినిధిగా వ్యవహరించారు. తర్వాత ఇరాన్ తొలి మహిళా ఉపాధ్యక్షురాలుగా కూడా పనిచేశారు. ఈ కారణంగానే హాష్మీని డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తాజాగా లక్ష్యంగా చేసుకున్నట్లు స్పష్టమవుతోంది.
ఈ పరిశీలన అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో ప్రకటన. దీనికి సంబంధించిన ట్వీట్లో పొందుపరిచారు. ఇలాంటి చర్యలు జరగడం ఇదే మొదటిసారి కాదని చెప్పారు. ఇటీవలే ఇరాన్ కు చెందిన కొందరు ప్రముఖ కుటుంబ సభ్యుల గ్రీన్ కార్డులను రద్దు చేసిన గుర్తు చేశారు.
ఇరాన్ జనరల్ ఖాసిమ్ సులేమానీ మేనకోడలు, కుమార్తె గ్రీన్ కార్డ్‌లు రద్దయ్యాయి. సులేమానీ 2020 జనవరిలో బాగ్దాద్‌లో జరిగిన అమెరికా దాడిలో మరణించిన విషయం తెలిసిందే. కాగా గ్రీన్ కార్డులు రద్దయిన వెంటనే ఆ ముగ్గురిని కూడా ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిని త్వరలోనే అమెరికా నుండి వెనక్కి ఇరాన్‌కు పంపనున్నారు. సంవత్సరాల తరబడి అమెరికాలో నివసిస్తోన్న వారికి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.