
ఆంధ్ర ప్రదేశ్
ఓయ్-సాయి చైతన్య
రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్ రైళ్లకు ఆదరణ పెరుగుతున్న వేళ.. మరింత విస్తరించాలని నిర్ణయించింది. అందులో భాగంగా ప్రస్తుతం విశాఖ నుంచి సికింద్రాబాద్ వరకు నడుస్తున్న వందేభారత్ కు మరో ప్రధాన స్టేషన్ లో హాల్టింగ్ సౌకర్యాన్ని కల్పించింది. అదే విధంగా ప్రస్తుతం స్పెషల్ రైళ్లుగా నడుస్తున్న తొమ్మది ఎక్స్ ప్రెస్ లను రెగ్యులర్ రైళ్లుగా మార్పు చేసారు. ప్రయాణీకుల నుంచి వస్తున్న ఆదరణ మేరకు ఈ నిర్ణయాల అమలుకు సిద్దమయ్యారు.
సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఇక నుంచి తాడేపల్లి గూడెం రైల్వే స్టేషన్‌లో కూడా ఆగనుంది. ఈ కేంద్రమంత్రి భూపతిరాజు ఏర్పాటు. స్థానికుల నుంచి వచ్చిన వినతులను రైల్వేశాఖ దృష్టికి భూపతిరాజు తీసుకెళ్లారు. తాతడేపల్లిగూడెం చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు వందే భారత్ సౌకర్యం అందుబాటులోకి రానుంది. తాడేపల్లిగూడెం కు వందేభారత్ రాకపోకల వేళలను రైల్వే శాఖ అధికారికంగా ప్రకటించనుంది. అదే విధంగా రైల్వేకు సంబంధించిన కీలక అంశాలను మంత్రి భూపతిరాజు ఉంచారు. గతంలో ఉన్న ప్రత్యేక రైళ్లను ఇప్పుడు 9 సర్వీస్‌లుగా మార్చినట్లు. సికింద్రాబాద్- అనకా పల్లి (17043/44), చర్లపల్లి – భువనేశ్వర్ న్యూ ఎక్స్‌ప్రెస్ (17067/68) రైళ్లు ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు స్టేషన్లలో ఆగమని తెలిపారు.

రెగ్యులర్ ఎక్స్ ప్రెస్ లుగా తొమ్మది స్పెషల్ ట్రైన్స్
అదే విధంగా చర్లపల్లి – అనకాపల్లి (17045/46), చర్లపల్లి – అ నకాపల్లి (17053/54), కాకినాడ టౌన్ – హిసార్ ఎక్స్‌ప్రెస్ (17 295/96) రైళ్లు తాడేపల్లిగూడెంలో నిలుపుదల సౌకర్యాన్ని కలిగి ఉన్నాయి. నియోజకవర్గంలోని ఇతర ప్రాంతాల ప్రయాణికుల కోసం తిరుపతి – నరసాపురం (17427/28) రైలు ఆకివీడు, భీమవరం టౌన్, భీమవరం, పాలకొల్లు, నరసాపురం స్టేషన్లలో ఆగ. కాకినాడ టౌన్ – లింగంపల్లి (12775/76), కాకినాడ టౌన్ – మైసూర్ ఎక్స్‌ప్రెస్ (17289/90) రైళ్లు తణుకు, భీమవరం టౌన్, ఆకివీడులో నిలుస్తుందని తెలిపారు. చర్లపల్లి – న రసాపురం ఎక్స్‌ప్రెస్ (17061/62) రైలు ఆకివీడు, భీమవరం టౌన్, వీరవాసరం, పాలకొల్లు, నరస పురం స్టేషన్‌లో ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని మంత్రి శ్రీనివాస వర్మ వివరించారు. జాతీయ రహదారి -165 నిర్మాణ పనులు రెండు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్నాయని, త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది.