Home ఎంటర్‌టెయిన్మెంట్ VV Vinayak: పవన్ కళ్యాణ్ – వి.వి. వినాయక్ కాంబోలో మూవీ.. అసలు నిజం బయటపెట్టిన సెన్సేషనల్ డైరెక్టర్! – VRM MEDIA

VV Vinayak: పవన్ కళ్యాణ్ – వి.వి. వినాయక్ కాంబోలో మూవీ.. అసలు నిజం బయటపెట్టిన సెన్సేషనల్ డైరెక్టర్! – VRM MEDIA

by VRM Media
0 comments
tmdb-header-middle-logo


  • పవన్ కళ్యాణ్ – వి.వి. వినాయక్ కాంబో ఎందుకు మిస్ అయింది?
  • క్రేజీ రీజన్ బయటపెట్టిన మాస్ డైరెక్టర్!

టాలీవుడ్‌లో మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు వి.వి. వినాయక్ (వివి వినాయక్). ‘ఆది’తో సంచలనం సృష్టించి, ‘ఠాగూర్’తో మెగాస్టార్ చిరంజీవికి మర్చిపోలేని హిట్ ఇచ్చిన ఈ సెన్సేషనల్ డైరెక్టర్, మెగా ఫ్యామిలీలో దాదాపు అందరు హీరోలతో సినిమాలు చేశారు. చిరంజీవికి ‘ఠాగూర్’, ‘ఖైదీ నంబర్ 150’ వంటి బ్లాక్ బస్టర్లు ఇచ్చారు. రామ్ చరణ్‌తో ‘నాయక్’ వంటి మాస్ హిట్ కొట్టారు. అల్లు అర్జున్‌తో ‘బన్నీ’, ‘బద్రీనాథ్’ వంటి భారీ చిత్రాలను తెరకెక్కించారు. అయితే మెగా ఫ్యామిలీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (పవన్ కళ్యాణ్)తో మాత్రం వినాయక్ ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా చేయలేదు.

చాలా కాలంగా ఫ్యాన్స్ మదిలో ఉన్న ఈ ప్రశ్నపై తాజాగా వినాయక్ ‘తెలుగువన్’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి తాను ప్రయత్నించానని, ఒకటి రెండు సందర్భాల్లో స్టోరీ డిస్కషన్స్ కూడా జరిగిపోయాయని ఆయన చెప్పారు. అయితే, ఆ కాంబినేషన్ పట్టాలెక్కకపోవడానికి గల కారణాన్ని కూడా ఆయన ఈ ఇంటర్వ్యూలో వివరించారు.

వినాయక్ చెప్పిన దాని ప్రకారం.. పవన్ కళ్యాణ్ కోసం ఆయన ఒక పవర్ ఫుల్ కథను సిద్ధం చేసి వినిపించారట. పవన్ తో కొంత కాలం ఆ కథ గురించి ట్రావెల్ కూడా చేశారట. కానీ, ఆ కథ పవన్ కళ్యాణ్‌కు పెద్దగా నచ్చలేదని వినాయక్ ఓపెన్‌గా చెప్పారు. “ఏదైనా మంచి కథ దొరికినప్పుడు చేద్దాం” అని పవన్ కళ్యాణ్ అన్నట్టు ఆయన గుర్తు చేసుకున్నారు. దాంతో ఇద్దరూ మ్యూచువల్ గా ఆ ప్రాజెక్ట్‌ను వద్దు అనుకున్నారని.

ఈ సందర్భంగా రామ్ చరణ్‌తో చేసిన ‘నాయక్’ సినిమా జ్ఞాపకాలను కూడా వినాయక్ పంచుకున్నారు. ‘ఠాగూర్’ షూటింగ్ సమయంలో చరణ్ బాబు చదువుకుంటున్నారని, అప్పుడప్పుడు సెట్స్‌కు వచ్చేవారని చెప్పారు. కానీ ‘నాయక్’ టైం కి ఆయన ఒక పెద్ద స్టార్ అయిపోయారని, ఆ సినిమా షూటింగ్ అంతా చాలా సరదాగా సాగిందని గుర్తు చేసుకున్నారు. ‘నాయక్’ బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో సాధించిందని వినాయక్ సంతోషం వ్యక్తం చేశారు.

అలాగే అల్లు అర్జున్‌తో చేసిన ‘బన్నీ’ ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసునని, ‘బద్రీనాథ్’ కూడా కమర్షియల్ గా మంచి లాభాలను తెచ్చిపెట్టిందని వినాయక్ చెప్పారు. మెగా హీరోలతో తనకున్న బ్యాండింగ్ ఎప్పుడూ అని ఆయన చెప్పుకొచ్చారు.

పవన్ కళ్యాణ్‌తో వినాయక్ మార్క్ మాస్ సినిమా మిస్ అవ్వడం అభిమానులకు కొంత నిరాశ కలిగించే విషయమే అయినా, భవిష్యత్తులో సరైన కథ కుదిరితే వీరిద్దరి కాంబోను వెండితెరపై చూసే అవకాశం ఉందేమో చూడాలి!

వి.వి. వినాయక్ ఫుల్ ఇంటర్వ్యూ కోసం, మరిన్ని ఆసక్తికర సినీ విశేషాల కోసం మా తెలుగువన్ (TeluguOne) యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.

2,803 Views

You may also like

Leave a Comment