

ప్రస్తుతం యువ పేసర్, యార్కర్ల కింగ్ అర్ష్‌దీప్ సింగ్ (అర్ష్‌దీప్ సింగ్) ప్రస్తుతం ఐపీఎల్ 2026లో తన అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. అయితే, ఇప్పుడు ఈ టాలెంటెడ్ బౌలర్.. కేవలం ఆటతోనే కాకుండా తన వ్యక్తిగత జీవితం కారణంగా కూడా వార్తల్లో నిలుస్తున్నాడు. గత కొన్ని రోజులుగా అర్ష్‌దీప్ సింగ్ ఓ ప్రముఖ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నాడని, త్వరలోనే ఓ ఇంటి వాడు కాబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఆ వార్తలకు బలం చేకూరుస్తూ తాజాగా ఒక వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఎవరా హీరోయిన్?
అర్ష్‌దీప్ సింగ్ మనసు గెలుచుకున్న ఆ బ్యూటీ మరెవరో కాదు.. ప్రముఖ పంజాబీ నటి, మోడల్ సమ్రీన్ కౌర్ (సమ్రీన్ కౌర్). ఈమె ఐపీఎల్ మ్యాచ్‌ల్లో అర్ష్‌ని ఉత్సాహపరచడానికి తరచుగా స్టేడియంలో కనిపిస్తూ ఉంటుంది. ఆమె పంజాబ్ కింగ్స్ టీంతో కలిసి కూడా పలు సందర్భాల్లో కనిపించడం ఈ ప్రేమ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది. పంజాబీ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సమ్రీన్, ఇప్పుడు అర్ష్‌దీప్‌తో కలిసి కెమెరా కంటికి చిక్కడం హాట్ టాపిక్‌గా మారింది.
కన్ఫర్మ్ అయినట్టేనా?
ఈ ప్రేమ వార్తల మధ్య అర్ష్‌దీప్ సింగ్-సమ్రీన్ కౌర్ కలిసి ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో వీరిద్దరూ ఒకరి చేతిని ఒకరు పట్టుకుని నడుస్తూ కనిపించారు. వారి మధ్య ఉన్న కెమిస్ట్రీ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. “పర్ఫెక్ట్ కపుల్” అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇలా కెమెరాల ముందు చేతులు పట్టుకుని కనిపించడంతో, వీరిద్దరూ తమ రిలేషన్‌షిప్‌ను పరోక్షంగా ప్రకటించినట్లేనని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.
సమ్రీన్ కౌర్ కెరీర్ ప్రస్థానం:
జమ్మూ కాశ్మీర్‌లో పుట్టి పెరిగిన సమ్రీన్ కౌర్, పంజాబీ సినిమాల్లో తనకంటూ ఒక ఇమేజ్‌ను సంపాదించుకుంది. కేవలం పంజాబీ సినిమాలకే పరిమితం కాకుండా, కపిల్ దేవ్ బయోపిక్ ’83’ లో కూడా ఆమె నటించింది. అలాగే పాపులర్ సింగర్స్ గురు రంధావా, బాద్షా వంటి స్టార్ల మ్యూజిక్ వీడియోల్లో కూడా ఆమె మెరిసింది. అద్భుతమైన గ్లామర్, టాలెంట్ ఉన్న సమ్రీన్.. ఇప్పుడు తాజాగా స్టార్ క్రికెటర్ మనసును గెలుచుకుని అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
మొత్తానికి క్రికెట్, సినిమా రంగాల మధ్య మరో కొత్త బంధం చిగురించినట్లు ప్రారంభమైంది. అర్ష్‌దీప్ సింగ్ తన బౌలింగ్‌తో బ్యాటర్ల వికెట్లు పడగొట్టడమే కాకుండా, నిజ జీవితంలో సమ్రీన్ కౌర్ చేతిలో క్లీన్ బౌల్డ్ అయ్యాడని నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.