

1. పెద్ది రికార్డుల వేట మొదలు
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న ‘పెద్ది’ మూవీ ఓవర్సీస్ లో సంచలనం సృష్టిస్తోంది. నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ బుకింగ్స్ ఓపెన్ అయిన 4 గంటల్లోనే.. ఒక లక్ష డాలర్ల మార్కును దాటి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా, జూన్ 3న ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నారు.
2. పవర్ ఫుల్ మ్యూజిక్ తో ‘డ్రాగన్’ గ్లింప్స్
ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘డ్రాగన్’. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20న గ్లింప్స్‌ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. ఇతర మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ గత మూడు రోజులుగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనుల్లో ప్రస్తుతం చూపుతున్నారు. ‘డ్రాగన్’ గ్లింప్స్‌కు ఆయన ‘పవర్ ఫుల్ అండ్ యూనిక్’ మ్యూజిక్ కంపోజ్ సమాచారం.
3. ‘రేజర్’ మూవీ రివ్యూ
రవిబాబు స్వీయ దర్శకత్వంలో రూపొందించిన యాక్షన్ థ్రిల్లర్ ‘రేజర్’ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక పవర్ ఫుల్ పొలిటీషియన్ అండ్ క్రిమినల్ గ్యాంగ్ బారి నుండి.. ఒక చిన్న పాప ప్రాణాలను రక్షించే వ్యక్తిగా రవిబాబు ఈ సినిమాలో కనిపించారు. సినిమా అంతా రవిబాబు మార్క్ వైల్డ్ యాక్షన్, హింసతో నిండిపోయింది. కథలో వైవిధ్యం లేకపోవడం, ఎమోషన్స్ పండకపోవడం వల్ల మైనస్ గా మారాయి.
4. ‘సతీ లీలావతి’ మూవీ రివ్యూ
లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో తాతినేని సత్య దర్శకత్వంలో వచ్చిన ‘సతీ లీలావతి’ ఒక యావరేజ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా మిగిలిపోయింది. విడాకులు కోరిన భర్తను భార్య బంధించి మనసు మార్చే ప్రయత్నం చేయడం అనే పాయింట్ ఆసక్తికరంగా ఉన్నా.. కథనంలో బలం లేకపోవడం వల్ల సినిమా సాగదీతగా అనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య ఉండాల్సిన బలమైన ఎమోషన్ మిస్ అయ్యింది. సిల్లీ డైలాగ్స్, లాజిక్ లేని సీన్స్ బోర్ కొట్టిస్తాయి.
5. ‘గోదారి గట్టుపైన’ మూవీ రివ్యూ
సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ జంటగా సుభాష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘గోదారి గట్టుపైన’ నేడు విడుదలైంది. ఒక ఆటో డ్రైవర్, ఇంజనీరింగ్ స్టూడెంట్ మధ్య సాగే ప్రేమకథకు.. గోదావరి నేపథ్యం, నాగవంశీ అందించిన సంగీతం ప్రధాన బలాలుగా నిలిచాయి. అయితే, కథలో కొత్తదనం లేకపోవడం, సాగదీత సన్నివేశాలు సినిమాకు మైనస్ అయ్యాయి.
6. ‘పెద్ది’ సెట్స్‌లో మెగాస్టార్ సందడి
రామ్ ‘పెద్ది’ షూటింగ్ సెట్స్‌ను మెగాస్టార్ చిరంజీవి చరణ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన దర్శకులు బుచ్చిబాబు, సుకుమార్‌లతో కలిసి సరదాగా ముచ్చటించారు. దీనికి సంబంధించిన వీడియోను బుచ్చిబాబు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. “ది బాస్, మై గురు ‘పెద్ది’ సెట్స్‌లో అడుగుపెట్టడం నా జీవితంలో మధుర జ్ఞాపకం” అని ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
.webp)
7. నెవర్ బిఫోర్ లుక్ లో తారక్
జూనియర్ ఎన్టీఆర్ అల్ట్రా స్టైలిష్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సంగీత దర్శకుడు థమన్ ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన ఎన్టీఆర్ ఫోటో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. బ్లాక్ అండ్ వైట్ థీమ్ లో.. గుబురు గడ్డం, నోటిలో టూత్ పిక్ తో ఎన్టీఆర్ చూపించిన యాటిట్యూడ్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఈ లుక్ తో ఒక్క సినిమా పడితే బాక్సాఫీస్ రికార్డులు గల్లంతేనని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
8. శ్రీదేవి కుటుంబానికి హైకోర్టులో ఊరట
దివంగత నటి శ్రీదేవి కుటుంబానికి మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. చెన్నై ఈసీఆర్ రోడ్డులోని 27 ఎకరాల భూమిపై వాటా కోరుతూ నటరాజన్, శివగామి దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. 37 ఏళ్లుగా శ్రీదేవి కుటుంబం ఆధీనంలో ఉన్న ఆస్తిపై ఇప్పుడు యాజమాన్య హక్కులు కోరడం తగదని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పుతో బోనీ కపూర్, జాన్వీ కపూర్, ఖుషీ కపూర్‌లకు ఆస్తి వివాదం నుండి విముక్తి లభించింది.
9. శక్తి కపూర్ ఆరోగ్యంగానే ఉన్నారు
సీనియర్ నటుడు శక్తి కపూర్ తన మరణం గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై బాలీవుడ్ నటులు ఒక వీడియో విడుదల చేశారు. తాను పూర్తిగా ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నానని, ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని ఆయన అభిమానులకు విజ్ఞప్తి చేశారు. గత కొద్ది రోజులుగా శక్తి కపూర్ ఆరోగ్య పరిస్థితి విషమించిందని, మరణించారని జరుగుతున్న ప్రచారానికి ఈ వీడియోతో చెక్ పడింది.
10. ఓటీటీలోకి ‘ధురందర్ 2’
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో, ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ‘ధురందర్ 2: ది రివేంజ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్.. మే 14 నుండి ఓటీటీలో స్ట్రీమింగ్. ఇండియాలో జియో హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుండగా.. ఓవర్సీస్ ప్రేక్షకులకు నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ సంస్థ.