Home ఎంటర్‌టెయిన్మెంట్ టాలీవుడ్‌లో ప్రకంపనలు.. నిర్మాతల మండలికి నట్టి కుమార్ రాజీనామా! – VRM MEDIA

టాలీవుడ్‌లో ప్రకంపనలు.. నిర్మాతల మండలికి నట్టి కుమార్ రాజీనామా! – VRM MEDIA

by VRM Media
0 comments
tmdb-header-middle-logo


తెలుగు సినీ పరిశ్రమలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ (TFPC) జైంట్ సెక్రటరీ పదవికి ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ రాజీనామా చేశారు. ఈ మేరకు కమిటీ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులకు ఆయన ఒక సుదీర్ఘమైన బహిరంగ లేఖను రాశారు. ఈ లేఖలో టాలీవుడ్ పనితీరుపై ఆయన చేసిన ఆరోపణలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

నట్టి కుమార్ తన రాజీనామా లేఖలో పరిపాలనపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా చిన్న నిర్మాతలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన ప్రస్తావించారు. పర్సంటేజ్ హ్యాండిల్ చేయడంలో కౌన్సిల్ విఫలమైందని, దీనివల్ల ఎగ్జిబిటర్లు పైచేయి సాధిస్తుంటే చిన్న నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కార్యవర్గ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం, గిల్డ్ పెత్తనం సాగడం వంటి అంశాలు ఆయన ఎండగట్టారు.

కౌన్సిల్‌లో ప్రజాస్వామ్యం కరువైందని, ఎన్నికలు లేదా నిబంధనలు లేకుండానే సంస్థ కొనసాగుతోందని నట్టి కుమార్. పరిపాలన, ఆడిటింగ్, ఆర్థిక నిర్వహణలో పారదర్శకత పూర్తిగా లోపించిందని, జవాబుదారీ లేని చోట తాను పదవిలో కొనసాగడం అర్థరహితమని ఆయన స్పష్టం చేశారు. కనీసం తన తర్వాత రాజీనామా అయినా సభ్యులందరూ మేల్కొని, సంస్థను వృత్తిపరంగా, పారదర్శకంగా నడపాలని ఆయన నిర్ణయించారు.

నట్టి కుమార్ రాజీనామాపై నిర్మాత మండలి ఇంకా అధికారికంగా స్పందించలేదు. అయితే, పరిశ్రమలో చిన్న నిర్మాతల పక్షాన నిలిచే వ్యక్తిగా పేరున్న నట్టి కుమార్ తీసుకున్న ఈ నిర్ణయం, మండలిలో రాబోయే రోజుల్లో ఎలాంటి మార్పులకు దారితీస్తుందో చూడాలి.

2,802 Views

You may also like

Leave a Comment