
భారతదేశం
-సయ్యద్ అహ్మద్
దాదాపు నాలుగేళ్ల తర్వాత మే 15న భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు (పెట్రోల్ మరియు డీజిల్ ధరలు) పెరిగాయి. రష్యా చమురు (రష్యన్ ఆయిల్) కొనుగోళ్లపై అమెరికా విధించిన కీలక ఆంక్షలకు ఇప్పుడు గడువు ముగియడంతో మరోసారి చమురు ధరలు పెరుగుతున్నాయి. పశ్చిమ ఆసియాలోని ఘర్షణలు, కీలకమైన చమురు రవాణా మార్గమైన హార్ముజ్ జలసంధి చుట్టూ సరఫరా అంతరాయల భయాలతో ప్రపంచ ముడి చమురు ధరలు ఇప్పటికే పెరుగుతున్న సమయంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.
గత శనివారం ట్రంప్ ప్రభుత్వం రష్యా సముద్ర చమురుపై ఆంక్షల మినహాయింపును ఒక నెల పొడిగింపు తర్వాత రద్దు చేసింది. దీనివల్ల గతంలో భారత్ సహా అనేక దేశాలు ఆక్షల ప్రమాదాలు లేకుండా రష్యా ముడి చమురును కొనుగోలు చేయగలిగాయి. గత రెండేళ్లుగా భారత్ రాయితీ కలిగిన రష్యన్ చమురుపై ఎక్కువగా ఆధారపడింది. ఇప్పుడు ఈ మినహాయింపు రద్దుతో భారత రిఫైనరీలు ఇప్పుడు రష్యన్ చమురు కొనుగోళ్లలో ఆంక్షల ముప్పు, ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉంది. భారత్ కు రష్యా ముడి దిగుమతులు ఇటీవల పెరిగాయి. మే నెలలో రోజుకు దాదాపు 2.3 మిలియన్ బ్యారెళ్లు, మే 14 నాటికి 1.88 బ్యారెళ్ల దిగుమతులు అంచనా వేశారు. ఈ రాయితీ అస్థిర ప్రపంచ ఇంధన మార్కెట్లలో భారత్ కు ఉపయోగపడుతుంది.

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధ ప్రయత్నాలు నిలిచిపోవడం, యూఏఈ అణు విద్యుత్ ప్లాంట్‌పై దాడి, ట్రంప్ ఇరాన్‌పై సైనిక చర్యల వార్తలతో ఇవాళ చమురు ధరలు మళ్లీ పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ 1.81% పెరిగి బ్యారెల్ 111.24 డాలర్లకు చేరగా, WTI క్రూడ్ 2.15% పెరిగింది 107.69 డాలర్లకు చేరింది. ఇప్పటికే చమురు కంపెనీలు పెరుగుతున్న చమురు వ్యయాలను భరించలేక ఈ నెల ప్రారంభంలో పెట్రోల్, డీ ధరలను లీటర్‌కు ₹3 పెంచాయి. ఇప్పుడు ముడి చమురు ధరలు పెరుగుతూ పోతే మరోసారి పెరగక తప్పని పరిస్థితి రానుంది. పశ్చిమాసియా పరిధులు మారకుండా ముడి ధరలు పెరుగుతూ ఉంటే.. నష్టాల భర్తీకి మొత్తంగా లీటర్‌కు సుమారు ₹10 పెరుగుదల అవసరమని సూచిస్తుంది.