Home ట్రెండింగ్ ప్రధాని మోదీతో ఓ చక్కటి సెల్ఫీ | ఇటలీ పర్యటనలో భాగంగా రోమ్‌కు చేరుకున్న ప్రధాని మోదీకి ఇటలీ ప్రధాని మెలోనీ హృదయపూర్వక స్వాగతం పలికారు. – VRM MEDIA

ప్రధాని మోదీతో ఓ చక్కటి సెల్ఫీ | ఇటలీ పర్యటనలో భాగంగా రోమ్‌కు చేరుకున్న ప్రధాని మోదీకి ఇటలీ ప్రధాని మెలోనీ హృదయపూర్వక స్వాగతం పలికారు. – VRM MEDIA

by VRM Media
0 comments
ప్రధాని మోదీతో ఓ చక్కటి సెల్ఫీ | ఇటలీ పర్యటనలో భాగంగా రోమ్‌కు చేరుకున్న ప్రధాని మోదీకి ఇటలీ ప్రధాని మెలోనీ హృదయపూర్వక స్వాగతం పలికారు.


అంతర్జాతీయ

ఓయ్-చంద్రశేఖర్ రావు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేశారు అయిదు దేశాల పర్యటన చివరి అంకానికి చేరుకుంది. ఇందులో భాగంగా ఇటలీకి చేరుకున్నారు. రాజధాని రోమ్‌లో ఆయనకు ఘనస్వాగతం లభించింది. రోమ్ విమానాశ్రయంలో ఇటలీ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఆంటోనియో ఆయనకు ఘన స్వాగతం పలికారు. అక్కడే భారత కళకారుల ప్రదర్శనను తిలకించారు. ఇటలీలోని ఇండియన్ డయాస్పోరా ఆయనకు ఆత్మీయ ఆహ్వానం పలికింది.

ఇటలీలో స్థిరపడిన పలువురు భారతీయులు విమానాశ్రయంలో మోదీని కలుసుకున్నారు. జాతీయ పతాకాలను పట్టుకుని కనిపించారు. వారిని మోదీ ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా మోదీకి వారణాశి ఘాట్ తో కూడిన ఓ భారీ రూపంలో ను ఆంటోనియో బహుకరించారు. అనంతరం ఆయన బస చేసిన హోటల్ వద్ద భారతీయుల సందడి. మోదీని కలిసిన వారిలో స్వామిని శుద్ధానంద గిరి ఉన్నారు. 2021లో మొదటిసారిగా మోదీని కలిసానని, ఇప్పుడు మళ్లీ ఆ అవకాశం దక్కిందని తెలియజేసారు.

ఇటలీ పర్యటనలో భాగంగా రోమ్‌కు చేరుకున్న ప్రధాని మోదీకి ఇటలీ ప్రధాని మెలోనీ హృదయపూర్వక స్వాగతం పలికారు.

మోదీ రాకను ప్రధాని పురస్కరించుకుని ఇటలీ జార్జియా మెలోనీ ఆయనకు స్వాగతం పలికారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన రోమ్ లోని కొలోజియం స్టాండ్స్ లో గతంలో మోదీతో కలిసి దిగిన సెల్ఫీని ఆమె తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో షేర్ చేశారు. మోదీకి ప్రత్యేకంగా స్వాగతం పలికారు. “వెల్కమ్ టు రొమ్ మై ఫ్రెండ్..” అని రాశారు. రెండేళ్ల వ్యవధిలో మోదీ ఇటలీని సందర్శించడం ఇది రెండోసారి ప్రాధాన్యతను సంతరించుకుంది. 2024 జూన్ లో ఆయన ఇటలీ వెళ్లారు.

ఈ పర్యటనలో మోదీ ఇటలీ అధ్యక్షుడు సెర్గియో మట్టరెల్లా, ప్రధానమంత్రి జార్జియా సమావేశంలో పలు కీలక చర్చలు నిర్వహించారు. ఈ పర్యటన ప్రధాన లక్ష్యం భారత్-ఇటలీ మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని మరింత పెంపొందించడం అని ప్రధాని మోరోమ్ చేరుకోవడానికి ముందు చెప్పారు. భారత్-పశ్చిమ ఆసియా- యూరప్ ఫైనాన్షియల్ కారిడార్ పై ప్రత్యేకంగా దృష్టి సారించడం, అలాగే 2025-2029కి సంబంధించిన ఉమ్మడి వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళికను సమీక్షించడం ఈ పర్యటనలో భాగం.

తన భాగంగా మోదీ ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ప్రపంచ ఆహార భద్రత పట్ల భారత నిబద్ధతను పునరుద్ఘాటించనున్నారు. భారత్-ఇటలీ వ్యూహాత్మక భాగస్వామ్యంలో కొత్త అధ్యాయం మొదలైందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. భారత్, ఇటలీల మధ్య దీర్ఘకాలిక భాగస్వామ్యం ఉందని, ఈ పర్యటన ఇరు దేశాల సంబంధాలకు కొత్త ఉత్తేజాన్ని ఇస్తుందని ఆయన చెప్పారు.



2,804 Views

You may also like

Leave a Comment