Home ట్రెండింగ్ కాల్పులతో దద్దరిల్లిన వైట్ హౌస్: 25 రౌండ్లు.. | వైట్ హౌస్ వద్ద భారీ తుపాకీ కాల్పులు, అనుమానితుడు ఆసుపత్రిలో మరణించాడు మరియు ఒక ప్రేక్షకుడిని సెక్యూరిటీ గాయపరిచారు – VRM MEDIA

కాల్పులతో దద్దరిల్లిన వైట్ హౌస్: 25 రౌండ్లు.. | వైట్ హౌస్ వద్ద భారీ తుపాకీ కాల్పులు, అనుమానితుడు ఆసుపత్రిలో మరణించాడు మరియు ఒక ప్రేక్షకుడిని సెక్యూరిటీ గాయపరిచారు – VRM MEDIA

by VRM Media
0 comments
కాల్పులతో దద్దరిల్లిన వైట్ హౌస్: 25 రౌండ్లు.. | వైట్ హౌస్ వద్ద భారీ తుపాకీ కాల్పులు, అనుమానితుడు ఆసుపత్రిలో మరణించాడు మరియు ఒక ప్రేక్షకుడిని సెక్యూరిటీ గాయపరిచారు


అంతర్జాతీయ

ఓయ్-చంద్రశేఖర్ రావు

అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఆ దేశాధ్యక్షుడి అధికారిక నివాసం వైట్ హౌస్ సమీపంలో ఆదివారం కాల్పులు సంభవించాయి. కాల్పులు జరుగుతున్న సమయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ లోనే ఉన్నారు. మొత్తం ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఘాతుకానికి హాజరు అయ్యారు. సమాచారం అందిన వెంటనే అదనపు భద్రత బలగాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. ఎదురు కాల్పులకు దిగాయి.

ఈ కాల్పుల్లో ఇద్దరు సాయుధులూ తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు భద్రత బలగాలు. అక్కడ చికిత్స పొందుతూ వారిలో ఒకరు మరణించారు. వైట్ హౌస్ చుట్టూ దాదాపు 25 రౌండ్ల కాల్పులు వినిపించినట్లు సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ అంచనా వేసింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది. భద్రతా సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని స్పష్టం చేసింది. దుండుగులు ఎవరనే విషయం దర్యాప్తు చేపట్టారు.

వైట్ హౌస్ వద్ద భారీ తుపాకీ కాల్పులు, అనుమానితుడు ఆసుపత్రిలో మరణించాడు మరియు ఒక ప్రేక్షకుడిని సెక్యూరిటీ గాయపరిచారు

ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) డైరెక్టర్ కాష్‌టేల్ కాల్పులు ఈ ఘటనను ధృవీకరించారు. ఎఫ్‌బీఐ టీమ్ సంఘటనా స్థలానికి చేరిందని, ఎదురు కాల్పుల్లో పాల్గొందని తెలిపారు. కాల్పుల అనంతరం, యునైటెడ్ స్టేట్స్ సీక్రెట్ సర్వీస్ స్నిపర్ బృందాలు వైట్ హౌస్ పైకప్పుపై మోహరించాయి. ఏదైనా భద్రతా ముప్పు ఏర్పడినప్పుడు.. స్నిపర్ టీమ్స్ ఎత్తైన ప్రదేశాల్లో మోహరించి, మొత్తం ప్రాంగణాన్ని ఆధీనంలోకి తీసుకోవడం అక్కడికి ఆనవాయితీ.

17వ స్ట్రీట్, పెన్సిల్వేనియా అవెన్యూ నార్త్‌వెస్ట్ుకుని వైట్ హౌస్ వరకూ సాయుధులైన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు గస్తీ మొదలైన. వైట్ హౌస్ నార్త్ లాన్ ప్రాంతంలో పహారా కాశారు. భద్రతా కారణాల దృష్ట్యా వెంటనే ప్రెస్ బ్రీఫింగ్ రూమ్ మూసివేశారు. నార్త్ లాన్ మొత్తం కూడా ఖాళీ అయింది. వైట్ హౌస్‌లోని రిపోర్టర్లందరినీ ప్రెస్ బ్రీఫింగ్ రూమ్‌లోకి వెళ్లాలని. మొత్తం భవనాన్నీ తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

ఈ ఘటన వైట్‌హౌస్‌లో తాత్కాలిక లాక్‌డౌన్ విధించారు. తర్వాత దానిని ఎత్తివేశారు. ఈ సంఘటనపై యూఎస్ కాంగ్రెస్ సభ్యులు స్పందించారు. రాండీ ఫైన్, న్యాన్సీ మేస్ ఈ ఘటనను ఖండించారు. అమెరికాలో రాజకీయ హింసకు స్థానం లేదని, దురదృష్టవశాత్తూ ఇది సాధారణమైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటివి చూసి తాము విసిగిపోయామని. దీనికి ముగింపు పలకాలని ఆకాంక్షించారు.



2,802 Views

You may also like

Leave a Comment