Home ఎంటర్‌టెయిన్మెంట్ కేవలం 58 గంటల్లో రూ.100 కోట్ల క్లబ్‌లో మోహన్‌లాల్ ‘దృశ్యం 3’.. వరల్డ్ వైడ్ ఊచకోత! – VRM MEDIA

కేవలం 58 గంటల్లో రూ.100 కోట్ల క్లబ్‌లో మోహన్‌లాల్ ‘దృశ్యం 3’.. వరల్డ్ వైడ్ ఊచకోత! – VRM MEDIA

by VRM Media
0 comments
tmdb-header-middle-logo


మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, డైరెక్టర్ జీతూ జోసెఫ్ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇండియన్ సినిమా హిస్టరీలోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఫ్రాంచైజీగా గుర్తింపు తెచ్చుకున్న ‘దృశ్యం’ సిరీస్‌లో భాగంగా వచ్చిన ‘దృశ్యం 3’ ప్రస్తుతం గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.

ఈ క్రేజీ మూవీ విడుదలైన నాటి నుంచే థియేటర్లలో వసూళ్ల వేట మొదలైంది. సరిగ్గా చెప్పాలంటే కేవలం 58 గంటల్లోనే (మూడు రోజుల్లో) ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల క్లబ్‌లో చేరి సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ సందర్భంగా స్వయంగా మోహన్‌లాల్ సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.

గత 13 సంవత్సరాలుగా ఈ ఫ్రాంచైజీ జర్నీలో భాగమైన అభిమానుల నమ్మకమే ఈ విజయానికి కారణమని మేకర్స్ చూస్తున్నారు. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ‘దృశ్యం 3’ చిత్రం మొదటి మూడు రోజుల్లోనే దాదాపు రూ. 117.17 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి మాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త మైలురాయిని అధిగమించింది.

వాస్తవానికి ఈ ప్రారంభ ఆరంభంలో మిక్స్‌డ్ టాక్ ఉన్నప్పటికీ.. జార్జ్‌కుట్టి పాత్రపై ఉన్న విపరీతమైన అంచనాల వల్ల ప్రేక్షకుల థియేటర్‌లకు క్యూ కడుతున్నారు. మొదటి రెండు భాగాలతో తాజా సస్పెన్స్ కొద్దిగా తగ్గింది, ఈసారి ఎమోషనల్ ఎలిమెంట్స్‌కు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చింది. తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు జార్జ్‌కుట్టి చేసే పోరాటంలో మోహన్‌లాల్ నటన మరోసారి ఆడియన్స్‌ను మెప్పించింది.

గతంలో వచ్చిన దృశ్యం 1, దృశ్యం 2 చిత్రాలు తెలుగులో రీమేక్ అయి ఇక్కడ కూడా భారీ విజయాన్ని సాధించాయి. అయితే ఈ మూడో చిత్రం పూర్తిగా కాకుండా నేరుగా మలయాళంతో పాటు తెలుగు, తమిళ కన్నడ భాషల్లో డబ్బింగ్ చేసి విడుదల చేశారు. తెలుగు ఆడియన్స్ రాంబాబు పాత్రకు బాగా కనెక్ట్ అవ్వడం వల్ల, ఇక్కడి నేటివిటీ పరంగా కొద్దిగా మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.

అయినప్పటికీ సోషల్ మీడియాలో ఈ చిత్రంపై విపరీతమైన బజ్ నడుస్తోంది. బుకింగ్స్ యాప్‌లో రికార్డు స్థాయిలో టికెట్లు అమ్ముడవుతుండటంతో ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. లాంగ్ రన్‌లో ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మరిన్ని భారీ వసూళ్లను సాధించి సరికొత్త రికార్డులను నమోదు చేయడం ఖాయంగా మారింది.

2,803 Views

You may also like

Leave a Comment