వ్యాపారం
ఓయ్-చంద్రశేఖర్ రావు
దేశీయ రిటైల్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. 24 క్యారెట్ల, 22 క్యారెట్ల బంగారం ధరల్లో స్వల్ప మార్పులు కనిపించగా, వెండి ధరల్లోనూ పరిమిత కదలిక నమోదైంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) వారాంతంలో మూసి ఉన్నందున ప్రత్యక్ష వాణిజ్య ధరలు అందుబాటులో లేవు. శుక్రవారం క్లోజింగ్ సెషన్ ప్రకారం బంగారం రూ. 1.50 లక్షల పైనే కొనసాగుతోంది. ఈ వారం వీటి రేట్లు ఎలా ఉండొచ్చనే విషయం గుబులు రేపుతోంది.
ఇండియన్ బులియన్ అసోసియేషన్ (IBA) డేటా ప్రకారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,59,340గా రికార్డు అయింది. 22 క్యారెట్ల బంగారం 1,46,062 రూపాయలకు చేరింది. 999 స్వచ్ఛత కిలో వెండి ధర రూ. 2,72,270 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల బంగారాన్ని అత్యంత స్వచ్ఛమైనదిగా పరిగణిస్తారు. ఆభరణాల తయారీకి 22 క్యారెట్ల బంగారం వినియోగం. మన్నిక అధికంగా ఉండటమే దీనికి ప్రధాన కారణం.

దేశంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రామాలకు రూ. 1,58,770, 22 క్యారెట్లు రూ. 1,45,539, వెండి 999 కిలో రూ. 2,71,310 గా నమోదైంది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం రూ. 1,59,050, 22 క్యారెట్లు రూ. 1,45,796/10gm, వెండి రూ. 2,71,780 రికార్డయింది. బెంగళూరులో 24 క్యారెట్లు రూ. 1,59,170, 22 క్యారెట్లు రూ. 1,45,906 వద్ద ట్రేడ్ అయింది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రామాలకు రూ. 1,59,300 కాగా 22 క్యారెట్లు 1,46,025, వెండి కిలో రూ. 2,72,210 వద్ద స్థిరపడింది.
24 క్యారెట్లు- రూ. 16,069, 22 క్యారెట్లు – రూ. 14,730, 18 క్యారెట్లు – రూ. 12,360
ముంబై..
24 క్యారెట్లు – రూ. 15,906, 22 క్యారెట్లు- రూ. 14,580, 18 క్యారెట్లు – రూ. 11,929
బెంగళూరు..
24 క్యారెట్లు – రూ. 15,906, 22 క్యారెట్లు- రూ. 14,580, 18 క్యారెట్లు – రూ. 11,929
హైదరాబాద్..
24 క్యారెట్లు – రూ. 15,906, 22 క్యారెట్లు- రూ. 14,580, 18 క్యారెట్లు – రూ. 11,929
విజయవాడ..
24 క్యారెట్లు – రూ. 15,906, 22 క్యారెట్లు- రూ. 14,580, 18 క్యారెట్లు – రూ. 11,929
విశాఖపట్నం..
24 క్యారెట్లు – రూ. 15,906, 22 క్యారెట్లు- రూ. 14,580, 18 క్యారెట్లు – రూ. 11,929