త్యాగానికి, భక్తిప్రపత్తులకు, దైవచింతనకు నిలువెత్తు రూపం బక్రీద్ (ఈద్-ఉల్-జుహా) పండుగ అని సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి మట్టా రాగమయి దయానంద్ గారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ముస్లిం సోదర సోదరీమణులందరికీ ఆమె హృదయపూర్వక పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
”మానవతావాదాన్ని చాటిచెప్పే గొప్ప పండుగ బక్రీద్. దేవునిపై అచంచలమైన విశ్వాసాన్ని, సమాజం పట్ల త్యాగనిరతిని ఈ పండుగ మనకు గుర్తుచేస్తుంది. ఉన్నదానిలో లేనివారికి దానం చేస్తూ, అందరి శ్రేయస్సును కోరే ఇస్లాం సంప్రదాయం ఎంతో గొప్పది. ఈ పవిత్ర పండుగ నియోజకవర్గ ప్రజలందరి జీవితాల్లో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, మరియు సోదరభావాన్ని మరింత పెంపొందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.”
ఇట్లు,
- శ్రీమతి మట్టా రాగమయి దయానంద్
ఎమ్మెల్యే, సత్తుపల్లి నియోజకవర్గం.
