[ad_1]
ఆంధ్ర ప్రదేశ్
ఓయ్-సయ్యద్ అహ్మద్
ఏపీ ప్రభుత్వం పాఠశాలలకు, ఇంటర్ కళాశాలలకు వెళ్లే విద్యార్ధులకు అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం (తల్లికి వందనం) డబ్బుల్ని ఈ ఏడాది కూడా విద్యా సంవత్సరం ప్రారంభంలో జమ చేయాల్సి ఉంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే అర్హులైన వివరాలను క్షేత్రస్ధాయిలో పరిశీలించే కార్యక్రమం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. దీని వెనుక ఉన్న కారణాలను ఓసారి చూద్దాం..
ఈసారి వేసవి సెలవుల తర్వాత కొత్త విద్యా సంవత్సరం జూన్ 12న ప్రారంభం కానుంది. అదే రోజు తల్లికి వందనం నిధులను తల్లుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం భావించింది. అయితే స్కూళ్ల నుంచి సేకరించిన విద్యార్ధుల డేటాను క్షేత్రస్దాయిలో పరిశీలన కోసం సచివాలయాలకు పంపారు. ఎక్కడా అనర్హులకు చోటివ్వకుండా అర్హులకే ఈ నిధులు అందేలా చూడటానికి ప్రభుత్వం క్షేత్రస్ధాయిలో నిశిత పరిశీలన చేస్తోంది. కఠిన మార్గదర్శకాలను కూడా ఇచ్చింది. ఈ మార్గదర్శకాల ప్రకారం క్షేత్రస్ధాయిలో పరిశీలన కొనసాగుతోంది.

తల్లికి వందనం పథకంలో దాదాపు 60 లక్షలకు పైగా లబ్దిదారులు ఉండటంతో వీరి డేటా పరిశీలన, ఖరారు ప్రక్రియ కాస్త ఆలస్యమవుతున్నట్లు. ముందుగా అనుకున్న విధంగా ఈ నెల 12న తల్లికి వందనం నిధులు విడుదల కావడం లేదని తేలిపోయింది. ఇప్పుడు తాజాగా జూన్ 19వ తేదీన తల్లికి వందనం నిధులను జమ చేయాలని భావిస్తోంది. ఇందులో మళ్లీ తేడా రాకుండా క్షేత్రస్ధాయి నుంచి అర్హులైన సమాచారం వచ్చి, జాబితా సిద్దం అయ్యాక అధికారికంగా ప్రకటన చేయాలని కోరినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన జూన్ 19న లేదా ఒక రోజు అటు, ఇటుగా నిధులు విడుదల ఖాయమే.
[ad_2]