[ad_1]
వ్యాపారం
ఓయ్-చంద్రశేఖర్ రావు
అమెరికా, ఇరాన్‌ల మధ్య అత్యంత దౌత్య ఒప్పందం త్వరలో జరగబోతోందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. ఈ నెల 19న శుక్రవారం నాడు ఈ చారిత్రక ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేస్తున్నాయి. దీనివల్ల వ్యూహాత్మకంగా ప్రపంచ రవాణా రంగానికి ఎంతో ప్రాధాన్యత కలిగిన హోర్ముజ్ జలసంధి రవాణా మార్గం వెంటనే తెరుచుకుంటుందని, దశాబ్దాల శత్రుత్వానికి ముగింపు పలుకుతూ నూతన దౌత్య సంబంధాలు ఊపందుకుంటాయని ట్రంప్ వివరించారు.
ఈ పరిణామాలు దేశీయ మార్కెట్లకు ఊపును తెచ్చాయి. సంచలనానికి దారితీశాయి. పసిడి, వెండి ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. కామెక్స్ ట్రేడింగ్‌లో గత 24 గంటలలో అంతర్జాతీయ స్పాట్ బంగారం ధర ఏకంగా 2.65 శాతం దూసుకెళ్లింది. దీనితో ప్రతి ఔన్స్ బంగారం ధర 4,351.20 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అదేవిధంగా వెండి ధర కూడా బలంగా పుంజుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ వెండి సుమారు 4.18 శాతం లాభపడి, ఔన్స్ ధర 70.81 డాలర్ల మార్కును తాకింది.

గ్లోబల్ మార్కెట్లలో ఊపందుకున్న ప్రవాహం దేశీయ మార్కెట్లపై కూడా బలమైన ప్రభావం చూపింది. భారత్ లో మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో బంగారం, వెండి ఫ్యూచర్స్ ధరలు భారీ లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మార్కెట్లో వ్యాపారాలు ఉత్సాహంగా సాగాయి. అంతర్జాతీయ పరిణామాలలో దేశీయ వెస్టర్లు కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇస్త ఈ ఇన్ ఊపు కొనసాగుతోంది.
ICEx లో బంగారం ఆగస్టు కాంట్రాక్ట్ 1.80 శాతం లాభపడింది. శుక్రవారం నాటి క్లోజింగ్ సెషన్‌తో పోల్చి చూస్తే 10 గ్రాముల ధరలో 2,750 రూపాయలకు పైగా పెరుగుదల కనిపించింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,53,300 రూపాయలకు చేరింది. వెండి జూలై కాంట్రాక్ట్ కూడా అదే స్థాయిలో దూసుకెళ్లింది. 2.56 శాతం లాభంతో కిలోకు 2,52,497 రూపాయల వద్ద స్థిరపడింది. అదేవిధంగా జూలై డెలివరీకి సంబంధించిన వెండి ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ కూడా మంచి దూకుడును ప్రదర్శించింది. ఇది గత సెషన్ కంటే 2.56 శాతం పెరిగి, ప్రతీ కిలోగ్రాముకు రూ. 2,52,497 స్థాయికి చేరుకుని ట్రేడింగ్‌ను కొనసాగించింది.
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 15,349, 22 క్యారెట్లు – రూ. 14,070, 18 క్యారెట్లు – రూ. 11,800
ముంబై..
24 క్యారెట్లు – రూ. 15,163, 22 క్యారెట్లు- రూ. 13,890, 18 క్యారెట్లు – రూ. 11,365
బెంగళూరు..
24 క్యారెట్లు – రూ. 15,163, 22 క్యారెట్లు- రూ. 13,890, 18 క్యారెట్లు – రూ. 11,365
హైదరాబాద్..
24 క్యారెట్లు – రూ. 15,163, 22 క్యారెట్లు- రూ. 13,890, 18 క్యారెట్లు – రూ. 11,365
విజయవాడ..
24 క్యారెట్లు – రూ. 15,163, 22 క్యారెట్లు- రూ. 13,890, 18 క్యారెట్లు – రూ. 11,365
విశాఖపట్నం..
24 క్యారెట్లు – రూ. 15,163, 22 క్యారెట్లు- రూ. 13,890, 18 క్యారెట్లు – రూ. 11,365
[ad_2]