[ad_1]
వ్యాపారం
ఓయ్-చంద్రశేఖర్ రావు
దేశీయ బంగారం, వెండి ధరలు ప్రస్తుతం నూతన పుంతలు తొక్కుతున్నాయి. రిటైల్ వినియోగదారులకు పసిడి ధరలలో పెద్దగా మార్పులు కనిపించలేదు. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో దేశవ్యాప్తంగా సగటున 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రామాలకు రూ. 1,43,320 లుగా నమోదైంది. అలాగే ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,31,540, 18 క్యారెట్లు రూ. 1,18,599 గా రికార్డయ్యాయి.
ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా సురక్షితమైన ప్రత్యామ్నాయ పెట్టుబడిగా భావించే బంగారం వైపు మదుపరులు ఆకర్షితులవుతారు. ఒక పక్క స్టాక్ మార్కెట్లు హెచ్చుతగ్గులకు లోనవుతున్నా, దీర్ఘకాలిక పెట్టుబడి సాధనంగా దీని ప్రాధాన్యత తగ్గలేదు. ప్రపంచంలో ప్రస్తుతం నెలకొన్న బలమైన రాజకీయ పరిణామాలు పసిడి ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల హెచ్చుతగ్గులు అంతర్జాతీయంగా మార్కెట్ సెంటిమెంట్‌ను నియంత్రిస్తున్నాయి.

హైదరాబాద్‌తో పాటు ముంబై, కోల్‌కతా, బెంగళూరులో బంగారం ధరలు దాదాపు ఒకే విధంగా ఉన్నాయి. చెన్నైలో పసిడి ధరలు మిగిలిన ప్రాంతాల కంటే కాస్త ఎక్కువగా నమోదయ్యాయి. బంగారంతో వెండి ధరలలో ప్రాంతాల వారిగా స్వల్ప వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో ఒక కిలో వెండి ధర 2,29,900లుగా నమోదు కాగా, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.2,34,900 కి చేరింది.
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 14,334, 22 క్యారెట్లు – రూ. 13,139, 18 క్యారెట్లు – రూ. 10,980
ముంబై..
24 క్యారెట్లు – రూ. 14,160, 22 క్యారెట్లు- రూ. 12,980, 18 క్యారెట్లు – రూ. 10,620
బెంగళూరు..
24 క్యారెట్లు – రూ. 14,160, 22 క్యారెట్లు- రూ. 12,980, 18 క్యారెట్లు – రూ. 10,620
హైదరాబాద్..
24 క్యారెట్లు – రూ. 14,160, 22 క్యారెట్లు- రూ. 12,980, 18 క్యారెట్లు – రూ. 10,620
విజయవాడ..
24 క్యారెట్లు – రూ. 14,160, 22 క్యారెట్లు- రూ. 12,980, 18 క్యారెట్లు – రూ. 10,620
విశాఖపట్నం..
24 క్యారెట్లు – రూ. 14,160, 22 క్యారెట్లు- రూ. 12,980, 18 క్యారెట్లు – రూ. 10,620
[ad_2]