Home ఎంటర్‌టెయిన్మెంట్ ప్రముఖ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ దారుణ హత్య – VRM MEDIA

ప్రముఖ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ దారుణ హత్య – VRM MEDIA

by VRM Media
0 comments
tmdb-header-middle-logo


సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ గా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది నిషా చౌహాన్. నిన్న తన భర్త ప్రదీప్ కుమార్ చేతిలోనే దారుణ హత్యకు గురైంది.ప్రదీప్, నిషాకి దాదాపు 18 ఏళ్ల క్రితం వివాహం కాగా ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రదీప్ గతంలో దుబాయ్‌లో ఏసీ మెకానిక్‌గా పనిచేసి ఏడాది క్రితమే భారతదేశానికి తిరిగి వచ్చాడు. అప్పటినుంచి భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తీవ్రమయ్యాయి. ఈ ధరనే వారు కొత్తగా కొనుగోలు చేసిన ఒక దుస్తుల విషయంలో ఇద్దరి మధ్య మొదలైన గొడవ చివరకి ప్రాణం తీసే వరకు వెళ్ళింది.

నిషా చౌహాన్ సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్‌గా ఉంటూ మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. భూమి కొనుగోలులో మెజారిటీ వాటాను తానే చెల్లించినందున, ఆ ప్లాట్‌పేషన్ తన పేరుతో జరగాలని నిషా పట్టుకుంది. దీనికి ప్రదీప్ అంగీకరించలేదు. నిషా ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న ప్రదీప్, ఒకవేళ ఆస్తి ఆమె పేరుతో ఉంటే దాన్ని తీసుకుని తనని వదిలేసి వెళ్ళిపోతుందేమోననే భయంతో ఉన్నాడు. ఈ సందర్భంగా గురువారం రాత్రి ఇద్దరి మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం జరిగింది. ఆ వివాదం మరుసటి రోజు కత్తితో పొడిచి చంపేశాడు. 17 ఏళ్ల పెద్ద కొడుకుకి ఈ దాడిలో స్వల్ప గాయాలయ్యాయి. ఆ అబ్బాయి సాయం కోసం వెంటనే కేకలు వేస్తూ పొరుగువారిని పిలవడానికి బయటకు పరుగెత్తాడు.

ఇది కూడా చదవండి: Jagapati Babu: తెలివైన నిర్ణయం తీసుకున్న జగపతిబాబు.. ఆ దర్శకుడితో ఏం చెప్పాడంటే?

పొరుగువారు సంఘటనా స్థలానికి చేరుకునే లోపే జరగకూడని ఘోరం జరిగింది. భార్యను రక్తపు మడుగులో పడేసిన ప్రదీప్, ఆ తర్వాత అదే తన ఛాతిపై, పొట్టపై పొడుచుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించి, తీవ్రంగా గాయపడిన ప్రదీప్‌ను మరియు అతని కుమారుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రదీప్ విషమంగానే ఉందని, అతని పరిస్థితి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నదని పోలీసులు తెలిపారు. నిషా వయసు 45 ఏళ్ళు కాగానే బ్యూటీషియన్ గా వర్క్ చేస్తుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

2,802 Views

You may also like

Leave a Comment