
సినీ పరిశ్రమలో గ్లామర్, టాలెంట్ ఎంత బాక్సాఫీస్ వద్ద ఒక సాలిడ్ సక్సెస్ పడితేనే ఆ క్రేజ్ మరియు గుర్తింపు శాశ్వతంగా నిలబడుతుంది. ఈ చేదు నిజాన్ని బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన అందాల భామ భాగ్యశ్రీ బోర్సే చాలా త్వరగానే అనుభవపూర్వకంగా తెలుసుకుంది. మాస్ మహారాజా రవితేజ సరసన నటించిన ‘మిస్టర్ బచ్చన్’ లాంటి భారీ అంచనాల సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మకు, ఆరంభంలోనే తీవ్ర నిరాశ ఎదురైంది. మొదటి సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలుకావడం, ఆ తర్వాత చేసిన చిత్రాలు కూడా ఆశించిన స్థాయిలో ఆడ పాత్ర ఆమెపై ఇండస్ట్రీలో చాలా వేగంగా ‘ఐరన్ లెగ్’ అనే అపవాదు, ముద్ర వేసే ప్రయత్నాలు జరిగాయి. ఒక నటిగా వరుస ఫ్లాపులు వస్తున్నా ఆమెకు అవకాశాలు తగ్గకపోయినప్పటికీ, తనపై ఉన్న ఆ ఫ్లాప్ ముద్రను చెరిపేసే ఒకే ఒక్క కమర్షియల్ హిట్ కోసం ఆమె మనసులో ఎంతో ఆరాటపడింది. ఎట్టకేలకు అక్కినేని యువ హీరో అఖిల్ అక్కినేని సరసన హీరోయిన్‌గా నటించిన ‘లెనిన్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కమర్షియల్ బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో ఈ భామ కళ్లల్లో ఆనంద బాష్పాలు కురిపించింది.
అఖిల్ అక్కినేని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనర్స్‌తో పాత రికార్డుల బద్దలు కొడుతూ ‘లెనిన్’ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ భారీ విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు చిత్ర యూనిట్ హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఒక గ్రాండ్ సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ వేడుకకు టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిగా విచ్చేశారు. సక్సెస్ మీట్ వేదికపై మైక్ పట్టుకుని మాట్లాడేందుకు ముందుకు వచ్చిన భాగ్యశ్రీ బోర్సే, ఒక్కసారిగా తీవ్ర భావోద్వేగానికి లోనై స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకున్నారు. తాను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుండి ఎదుర్కొన్న విమర్శలు, నెగెటివిటీ, ఈ సినిమా కోసం పడిన కష్టం, వీటని మించి కింగ్ నాగార్జున వేదికపై తన నటనను ప్రశంసించడాన్ని గుర్తుచేసుకుంటూ ఆమె భావోద్వేగాన్ని ఆపుకోలేక కంటతడి పెట్టారు. ఆమె కన్నీళ్లు పెట్టుకోవడం చూసి వేదికపై ఉన్న చిత్ర యూనిట్ సభ్యులతో పాటు అక్కడున్న అభిమానులు కూడా ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు.
ఈ వేడుకలో భాగ్యశ్రీ కొద్దికొద్దిగా తెలుగులో మాట్లాడుతూ తన క్యూట్ స్పీచ్‌తో అక్కడున్న వారందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “నా అభిమానులు నన్ను నిరంతరం ప్రోత్సహిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో నాపై వారు అమితంగా ప్రేమ, నాపై చేస్తున్న స్పెషల్ రీళ్లు, ఇస్తున్న సపోర్ట్ వల్లే నేను ఈ రోజు ఈ స్థాయిలో ధైర్యంగా నిలబడగలిగాను. టాలీవుడ్‌తో తనకున్న అనుబంధాన్ని వివరిస్తూ, “హైదరాబాద్ నా కర్మభూమి. ఇక్కడి ప్రేక్షకులు నాపై చూపిస్తున్న ఆదరణ, ప్రేమ ఎప్పటికీ మరువలేనిది. నా సినీ ప్రయాణంలో ఆఖరి సినిమా కూడా ఈ టాలీవుడ్‌లోనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అంటూ తెలుగు సినిమా పరిశ్రమపై తన ప్రేమను చాటుకున్నారు.
‘లెనిన్’ చిత్రం భాగ్యశ్రీ బోర్సే కెరీర్‌కు టాలీవుడ్‌లో ఒక లక్కీ టర్నింగ్ పాయింట్‌గా మారిందని చెప్పాలి. ఈ సినిమాలో ఒక చక్కటి పల్లెటూరి అమ్మాయి ‘భారతి’ పాత్రలో ఆమె ఒదిగిపోయిన తీరుకు ప్రేక్షకులు నుండే కాకుండా సినీ విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. ముఖ్యంగా హీరో అఖిల్‌తో ఆమె పండించిన లవ్ ట్రాక్, ఎమోషనల్ సన్నివేశాలు మరియు వారిద్దరి మధ్య ఉన్న స్క్రీన్ కెమిస్ట్రీ థియేటర్లలో ప్రేక్షకులు విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఒకవైపు హీరో అఖిల్ అక్కినేని తన కెరీర్‌లో తొలి భారీ కమర్షియల్ విజయం దక్కడంతో తండ్రి నాగార్జున కాళ్లపై పడి ఎమోషనల్ అవ్వగా, మరోవైపు హీరోయిన్ భాగ్యశ్రీ కూడా తనపై ఉన్న ఫ్లాప్ ముద్రణ తొలిగిపోవడంతో కన్నీటి పర్యంతం కావడం ఈ సక్సెస్ మీట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మొత్తానికి ‘లెనిన్’ సాధించిన ఈ భారీ బ్లాక్‌బస్టర్ సక్సెస్ భాగ్యశ్రీ బోర్సే కెరీర్ గ్రాఫ్‌ను టాలీవుడ్‌లో సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లడం ఖాయంగా మారింది.
భాగ్యశ్రీ బోర్సే, లెనిన్ సక్సెస్ మీట్, అఖిల్ అక్కినేని, నాగార్జున, భాగ్యశ్రీ బోర్స్ ఏడుపు, లెనిన్ మూవీ బ్లాక్ బస్టర్