Home ఎంటర్‌టెయిన్మెంట్ హీరోయిన్ల దుస్తులపై కామెంట్స్.. శివాజీపై మంచు మనోజ్ ఫైర్! – VRM MEDIA

హీరోయిన్ల దుస్తులపై కామెంట్స్.. శివాజీపై మంచు మనోజ్ ఫైర్! – VRM MEDIA

by VRM Media
0 comments
హీరోయిన్ల దుస్తులపై కామెంట్స్.. శివాజీపై మంచు మనోజ్ ఫైర్!



దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ల డ్రెస్ ల గురించి ప్రముఖ నటుడు శివాజీ చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. ఆయన మాట్లాడిన విషయం కరెక్టే కానీ, మాట్లాడిన విధానం తప్పని కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం ఆయన కామెంట్స్ ని పూర్తిగా ఖండించారు.

చిన్మయి, అనసూయ వంటి వారు ఇప్పటికే శివాజీ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఎవరెలాంటి డ్రెస్ వేసుకోవాలి అనేది వారి వ్యక్తిగత విషయమని, ఫలానా డ్రెస్ వేసుకోవాలని చెప్పే రైట్ ఎవరికీ లేదని అన్నారు. అంతేకాదు, మహిళలకు చీర కట్టుకోమని చెబుతున్న ఆయన.. మరి సంప్రదాయాన్ని గౌరవిస్తూ పంచె కట్టుకున్నాడా? అని ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి: మళ్ళీ సింగర్ గా మారిన బాలయ్య.. ఏ సినిమా కోసమో తెలుసా..?

ఇక తాజాగా శివాజీ కామెంట్స్ ని మంచు మనోజ్ కూడా ఖండించాడు. “ఈ రకమైన కామెంట్స్ తీవ్ర నిరాశను కలిగిస్తాయి. మహిళల దుస్తుల గురించి మాట్లాడటం సరైనది కాదు. వ్యక్తిగత ప్రవర్తనతో రావాలి. మహిళల దుస్తుల గురించి మాట్లాడండి, వారిని అవమానించడం కాదు. మహిళలను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటుల కోసం నేను క్షమాపణలు కోరుతున్నాను.” అని మనోజ్ రాసుకొచ్చాడు.

2,814 Views

You may also like

Leave a Comment