Home ట్రెండింగ్ మనదేశంలో అత్యధికంగా పెట్రోలియంను ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఇదే.. | భారతదేశంలో రాష్ట్రాలవారీగా పెట్రోలియం ఉత్పత్తి అత్యధిక మొత్తంలో పెట్రోలియం ఉత్పత్తి చేసే భారతీయ రాష్ట్రం ఏది? – VRM MEDIA

మనదేశంలో అత్యధికంగా పెట్రోలియంను ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఇదే.. | భారతదేశంలో రాష్ట్రాలవారీగా పెట్రోలియం ఉత్పత్తి అత్యధిక మొత్తంలో పెట్రోలియం ఉత్పత్తి చేసే భారతీయ రాష్ట్రం ఏది? – VRM MEDIA

by VRM Media
0 comments
మనదేశంలో అత్యధికంగా పెట్రోలియంను ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఇదే.. | భారతదేశంలో రాష్ట్రాలవారీగా పెట్రోలియం ఉత్పత్తి అత్యధిక మొత్తంలో పెట్రోలియం ఉత్పత్తి చేసే భారతీయ రాష్ట్రం ఏది?


భారతదేశం

ఓయ్-బొమ్మ శివకుమార్

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతున్నాయి. 33 రోజులుగా ఇరాన్- ఇజ్రాయెల్- అమెరికా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఓ వైపు చర్చలు అంటూనే మరోవైపు దాడులకు పాల్పడుతోంది అమెరికా. పశ్చిమాసియాలో సైన్యాన్ని మోహరించింది. ఇక ఇరాన్ సైతం ప్రతీకార దాడులను వేగవంతం చేసింది. అమెరికా భూతల దాడులు చేస్తే సాంకేతిక సంస్థలపై దాడులు ఇరాన్ సంచలన వార్నింగ్ ఇచ్చింది. ఇక యుద్ధం కారణంగా హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన విషయం తెలిసిందే. దాంతో ప్రపంచ దేశాలు చమురు సంక్షోభంలో మునిగిపోయాయి.

ప్రపంచ దేశాల్లో కొరత తీవ్రంగా ఉంది. ఎన్నో కీలక దేశాల్లో ముడి చమురు రవాణాకు అత్యంత అంతర్జాతీయ జలమార్గం హార్మూజ్‌ జలసంధిని ఇరాన్ మూసివేసింది. ప్రతిరోజూ ప్రపంచవ్యాప్తంగా జరిగే ముడిచమురు సరఫరాలో 20 శాతం హార్మూజ్ జలసంధి మీదగానే జరుగుతుంది. అలాగే రోజూ భారత్ కు వచ్చే 5.5 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురులో దాదాపు 2 మిలియన్ బ్యారెళ్లు హార్మూజ్ మీదుగా వస్తుంటుంది. అలాగే భారత్ కు చెందిన 40 శాతం క్రూడ్ ఆయిల్ దిగుమతులు, 54 శాతం లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ దిగుమతులు హార్మూజ్ జలసంధి మీదుగా వస్తుంటాయి. ఈ పరిణామాల మధ్య భారత్ లో అత్యధికంగా చమురు ఉత్పత్తి చేసే రాష్ట్రం గురించి తెలుసా..?

భారత్ లో అత్యధికంగా పెట్రోలియంను ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రంగా రాజస్థాన్ తొలి స్థానంలో ఉంది. ఎడారి ప్రాంతంగా ఉన్న రాజస్థాన్.. ఇప్పుడు దేశంలోనే అత్యధికంగా పెట్రోలియంను ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రంగా నిలిచింది. దేశంలోని డొమెస్టిక్ ఉత్పత్తి క్రూడ్ ఆయిల్ సరఫరాలో దాదాపు 20- 25 శాతం ఇక్కడి నుంచే అవుతుంది. రాజస్థాన్ లోని బార్మర్- సంచార్ బేసిన్ లో అత్యధికంగా పెట్రోలియం లభ్యం అవుతుంది. ఇక్కడే మంగళ, భాగ్యం, ఐశ్వరియా ఆయిల్ ఫీల్డ్స్ లొకేట్ అయి ఉన్నాయి.

భారతదేశం వారీగా పెట్రోలియం ఉత్పత్తి ఏ భారతదేశంలో అత్యధిక మొత్తంలో పెట్రోలియం ఉత్పత్తి చేస్తుంది

రాజస్థాన్ భూమి లోపల సాండ్ స్టోన్ కింది భాగంలో చమురు నిల్వలు ఉన్నాయి. వేల సంవత్సరాల ఆర్గానిక్ మెటీరియల్ పూడ్చబడి ఉంది. అధిక హీట్ అండ్ ప్రెషర్ కారణంగా చమురు ఏర్పడింది. ఈ ఆయిల్ ను కెర్న్ ఆయిల్ అండ్ గ్యాస్ (వేదాంత) కంపెనీలు మోడ్రన్ టెక్నాలజీని ఉపయోగించి బయటకు తీస్తాయి. ఆ తర్వాత దాదాపు 700 కిలోమీటర్ల పొడవున్న హీటెడ్ పైప్ లైన్ ద్వారా గుజరాత్ లోని రిఫైనరీస్ కు దీన్ని తరలిస్తారు. ఇక రాజస్థాన్ తర్వాత రెండో స్థానంలో గుజరాత్ ఉంది. మూడో స్థానంలో అసోం ఉంది. నాలుగో స్థానంలో తమిళనాడు, ఐదో స్థానంలో ఆంధ్ర ప్రదేశ్ ఉన్నాయి.

2,806 Views

You may also like

Leave a Comment