Home అంతర్జాతీయ సెమీస్ బెర్త్ ఎవరిదో.. ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ మధ్య నేడు కీలక పోరు.! -VRM MEDIA

సెమీస్ బెర్త్ ఎవరిదో.. ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ మధ్య నేడు కీలక పోరు.! -VRM MEDIA

by VRM Media
0 comments
సెమీస్ బెర్త్ ఎవరిదో .. ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ నేడు కీలక కీలక.!


ఛాంపియన్స్ లీగ్ లో భాగంగా శుక్రవారం కీలక మ్యాచ్ జరగనుంది. ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరగనున్న ఈ మ్యాచ్‌లో విజయం సాధించే జట్టు సెమీస్‌కు అర్హత సాధిస్తుంది. ఈ మ్యాచ్ లో గెలిచే జట్టు నాకౌట్ కు చేరుతుంది. ఆస్ట్రేలియా ఖాతాలో మూడు పాయింట్లు ఉండగా.. ఇంగ్లాండ్ జట్టుపై సంచలన విజయంతో ఆఫ్గనిస్తాన్ జట్టు 2 పాయింట్లతో ఈ రేసులో నిలిచింది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే ఆస్ట్రేలియా జట్టు నాలుగు పాయింట్లతో ముందుకెళ్లే అవకాశం ఉంది. కానీ మూడు పాయింట్లతో నిలిచే ఆఫ్గానిస్థాన్ దాదాపు నిష్క్రమించినట్టే అవుతుంది. ఒకవేళ ఆ జట్టు దక్షిణాఫ్రికాపై భారీ విజయం సాధిస్తే రన్ రేట్ ప్రకారం ఆఫ్గనిస్తాన్ జట్టుకు ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతానికైతే షాహిదీ సేన ఎనలేని ఆత్మవిశ్వాసంతో ఉంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో అసాధారణ ఆటతీరుతో పటిష్టమైన జట్టును ఆఫ్గనిస్తాన్ జట్టు ఓడించింది. 200 పరుగులు కూడా కష్టమే అనుకున్న చోట జద్రాన్ వీరోచిత శతకంతో ఏకంగా 300కి పైగా పరుగులు చేసిన జట్టు చేయగలిగింది. అదే ఊపులో ఆస్ట్రేలియా అని కూడా మట్టి కల్పించాలన్న ఆశయంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు బరిలోకి దిగుతున్నారు. 2023 వన్డే వరల్డ్ కప్‌లో మాక్స్‌వెల్ డబుల్ సెంచరీతో ఆసీస్ జట్టును విజయతీరాలకు చేర్చాడు.

అప్పటి ఓటమిని తాజా మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా సరిచేయాలన్న లక్ష్యంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఉంది. ఈ ఫార్మాట్‌లో కంగారులపై తొలి విజయం సాధించాలని కుతూహలంతో ఆఫ్గనిస్తాన్ జట్టు బరిలోకి దిగుతోంది. అటు ఆస్ట్రేలియా జట్టు టోర్నీలో ఒక్క మ్యాచ్ పూర్తిగా ఆడింది. వర్షం కారణంగా దక్షిణాఫ్రికా తో మ్యాచ్ రద్దయింది. ఆస్ట్రేలియా జట్టులో కమిన్స్, స్టార్క్, హజల్ వుడ్, మార్ష్ లేకపోయినా బలంగానే ఉన్నాడు. ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్లో 352 పరుగుల లక్ష్యాన్ని సులభంగా ఛేదించి తమ సత్తాను మరోసారి ఆస్ట్రేలియా జట్టు చాటింది. వారం రోజుల పాటు విశ్రాంతి లభించడంతో ఆస్ట్రేలియా ప్లేయర్లు తాజాగా బరిలోకి దిగబోతున్నారు. ఈ మ్యాచ్‌లో హెడ్, స్మిత్ బ్యాట్ ఝులిపిస్తే ఆస్ట్రేలియా జట్టు భారీ పరుగులను సాధించేందుకు అవకాశం ఉంటుంది. ఏమరపాటు ప్రదర్శించిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు షాక్ ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది అన్న విషయం ఆస్ట్రేలియా జట్టుకు తెలుసు. కాబట్టి అత్యంత జాగ్రత్తతో ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు బరిలోకి దిగే అవకాశం ఉంది. అదే సమయంలో ఆఫ్గనిస్తాన్ జట్టు కూడా బలమైన ఆస్ట్రేలియాను ఢీకొట్టేందుకు అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటుంది. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో బరిలోకి దిగుతుంది. ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన జద్రాన్‌తోపాటు కీలక బృందం రాణిస్తే ఆస్ట్రేలియా జట్టుకు షాక్ ఇవ్వడం పెద్ద కష్టమేమీ కాదన్నా భావనను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఉన్న ఫామ్‌ను బట్టి చూస్తే ఈ మ్యాచ్ అత్యంత ఆసక్తికరంగా సాగుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఏది ఏమైనా ఈ మ్యాచ్ క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగిస్తుంది. లాహోర్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.

ఆంధ్రా కింగ్ తాలూకా యూ/ఏ
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

2,808 Views

You may also like

Leave a Comment