
7న కోనరాజుపల్లెలో శ్రీ అభయాంజనేయ స్వామి తృతీయ వార్షికోత్సవం
,VMR న్యూస్ ఒంటిమిట్ట రిపోర్టర్ దాసరి శేఖర్ 04/ 06/2025 వైయస్సార్ కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండలం కోన రాజు పల్లె అరుంధతి వాడలో వెలసిన శ్రీ అభయాంజనేయ స్వామి తృతీయ వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఉదయం 10:30 గంటలకు సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు దాతలు సహకారంతో12 గంటలకు అన్నదానం ఏర్పాటు చేశారు మధ్యాహ్నం 1:00 నుండి ఓల్డ్ వృషభరాజ్యములచే మండలాలు పోటీలు నిర్వహించనున్నారు తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు సౌజన్యంతో బండలాగుడు పోటీల్లో మొదటి బహుమతి 50 వేల రూపాయలు ప్రకటించారు రాజంపేట గీతాంజలి విద్యాసంస్థల అధినేత సంబావు వెంకటరమణ సౌజన్యంతో ద్వితీయ బహుమతి 40 వేల రూపాయలు ప్రకటించారు ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ ఎస్వీ రమణ ఒంటిమిట్ట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గజ్జల నరసింహారెడ్డి ల సౌజన్యంతో తృతీయ బహుమతి 30 వేలు ఇవ్వనున్నారు కోన రాజు పల్లెకి చెందిన మహేష్ నాయుడు సౌజన్యంతో నాలుగో బహుమతి 20 వేలు ఇవ్వనున్నారు అమ్మవారి పల్లి చెందిన నితీష్ రెడ్డి టైగర్ సుబ్బయ్య యాదవ్ సౌజన్యంతో 5వ బహుమతి 10వేల రూపాయలు ప్రకటించారు అమ్మవారి పలికిందిన ఎర్రయ్య సౌజన్యంతో ఆరో బహుమతి 5000 రూపాయలు ఇవ్వనున్నారు అభయాంజనేయ స్వామి తృతీయ వార్షికోత్సవాల్లో భక్తులు ప్రజలు విరివిగా పాల్గొని జయప్రదం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు
