కల్లూరు లోని బాలికల గురుకుల కళాశాలలో ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియcట్ వరకు సుమారు 600 మంది విద్యార్థులు ఉన్నారు వారు తల్లిదండ్రులతో మాట్లాడేందుకు ఫోన్ సౌకర్యాన్ని అందుబాటులోకి వచ్చినటు కళాశాల ప్రిన్సిపాల్ కనకదుర్గ తెలియజేశారు గతంలో హాస్టల్కు ఎవరొచ్చినా పిల్లలకు ఫోన్ మాట్లాడే అవకాశం లేక టీచర్లు ఫోన్లు ఇవ్వక వచ్చిన వారిని అడిగి,పిల్లలు తల్లిదండ్రులకు ఫోన్లో మాట్లాడేవారు ఎన్నో ఇబ్బందులు గురయ్యారు తెలంగాణ ప్రభుత్వం ఆరు ఫోన్ బాక్సులు ఏర్పాటు చేసినట్లు వివరించారు కేవలం తల్లిదండ్రుల ఫోన్ నెంబర్ కి మాట్లాడేందుకు ఈ సౌకర్యం కల్పించినట్లు వారు పేర్కొన్నారు. ప్రతిరోజు సమయాన్నిబట్టి 25 నిమిషాలు పాటు మాట్లాడేందుకు ఈ అవకాశం కల్పించినట్లు వివరించారు అదేవిధంగా కళాశాలలో సమస్యల ఏమైనా ఉంటే నేరుగా టోల్ ఫ్రీ నెంబర్ కు కూడా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసుకునేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడేందుకు ఈ ఫోన్ సౌకర్యం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు
