Home ఆంధ్రప్రదేశ్ టక్కోలు గ్రామంలో ఇంటింటికీ చెత్త సేకరణ కార్యక్రమం

టక్కోలు గ్రామంలో ఇంటింటికీ చెత్త సేకరణ కార్యక్రమం

by VRM Media
0 comments

సిద్ధవటం VRM న్యూస్ జూన్ 27

టక్కోలు, సిద్దవటం మండలం:
టక్కోలు గ్రామ పంచాయతీలో ప్రతి రోజు ఇంటి ఇంటికి చెత్త సేకరణ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. గ్రామాన్ని శుభ్రంగా ఉంచే ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కార్యదర్శి నాగ ముని రెడ్డి , పంచాయతీ కార్యదర్శి, ఏరికల రెడ్డి గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాగముని రెడ్డి మాట్లాడుతూ, “ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం ఇంటింటికి చెత్త సేకరణ అత్యంత అవసరం. స్వచ్ఛత పట్ల ప్రతి ఒక్కరిలో అవగాహన పెరగాలి. కూటమి ప్రభుత్వం స్వచ్ఛతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. ప్రతి గ్రామంలో శుద్ధి కార్యక్రమాలు ప్రాధాన్యతతో కొనసాగుతున్నాయి” అని అన్నారు.

2,864 Views

You may also like

Leave a Comment