Home వార్తలుఖమ్మం మున్సిపల్ కార్మికులకు ఏఐటియుసి అండగా ఉంటుంది.

మున్సిపల్ కార్మికులకు ఏఐటియుసి అండగా ఉంటుంది.

by VRM Media
0 comments

ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోట రామాంజనేయులు.

అనునిత్యం కార్మికుల హక్కుల సాధన కొరకు సమస్యల పరిష్కారం కొరకు పోరాటం చేసే ఏఐటీయూసీ కల్లూరు మున్సిపల్ కార్మికులకు కూడా అండగా ఉంటుందని ఏఐటియుసి ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి తోట రామాంజనేయులు భరోసా ఇచ్చారు. శుక్రవారం ఏఐటీయూసీ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు వేము రాంబాబు అధ్యక్షతన జరిగిన పోయిరా మున్సిపల్ కార్మికుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ మేజర్ గ్రామపంచాయతీ తో పాటు పలు గ్రామపంచాయతీలో పని చేసే గ్రామపంచాయతీ సిబ్బందిని మున్సిపల్ లో విలీనం చేసే ప్రక్రియ తరగతినా పూర్తి చేయాలన్నారు. వాచా నాయకు తండా, తూర్పు పడమర లోకారములు, కప్పల బంధం, పుల్లయ్య బంజర, కృష్ణయ్య బంజర , హనుమా తండా తదితర గ్రామాలను కలుపుకొని నూతనంగా కల్లూరు మున్సిపాలిటీగా ఏర్పడటంతో ఆయా గ్రామపంచాయతీలలో పని చేసే మల్టీ పర్పస్ వర్కర్స్ అందరిని మున్సిపాలిటీలలో విలీనం చేసుకొని వారికి జీవో నెంబర్ 12 ప్రకారం జీతాలు చెల్లించాలన్నారు. కనీస వేతనం 26 వేల రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించిందని, కానీ అదే ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలు కనీస వేతనాన్ని కూడా అమలు చేయడం లేదన్నారు. మున్సిపల్ రంగ కార్మికులకు కనీస వేతనం అమలు చేయడంతో పాటు 10 లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్, 10 లక్షల రూపాయల లైఫ్ ఇన్సూరెన్స్ సౌకర్యాలను లతో పాటు , పీఎఫ్ సౌకర్యాన్ని కల్పించాలని ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికులకు ఎల్లవేళలా ఏఐటీయూసీ అండగా ఉంటుందని వారి సమస్యల పరిష్కారం కోసం 106సంవత్సరాల క్రితం ఆవిర్భవించిందని ఆనాటి నుండి నేటి వరకు రాజీలేని పోరాటాలు నిర్వహిస్తుందన్నారు. అనంతరం మున్సిపల్ కార్మికులకు ఏఐటియుసి కండువా కప్పి సంఘంలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో, జిల్లా నాయకులు దామాల దయాకర్,తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాప్ & అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఓడల కృష్ణ, చింతపల్లి శ్రీనివాసరావు, చెరసాని గోపయ్య, లక్ష్మయ్య, గొల్లమందల యశోద, మోదుగు సీతమ్మ, దామాల చిన్న ముసలయ్య , అజ్మీర రాంబాబు, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. కల్లూరు ప్రతినిధి శ్రీనివాస రాథోడ్

2,809 Views

You may also like

Leave a Comment