
రాజంపేటVRM న్యూస్ జూలై 6.

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ యం.ఎల్.సి, రాజంపేట నియెాజక వర్గ ఇంచార్జ్ బత్యాల చెంగల్ రాయుడు 70వ పుట్టిన రోజు సందర్భంగా రాజంపేట పార్లమెంటు వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి చలపాటి చంద్ర (NRI), ఎన్.డి.ఏ కూటమి యువ నాయకుడు అతికారి క్రిష్ణ అనుచరుడు డేరంగుల శ్రీకాంత్ బత్యాలకు గజమాల వేసి, శాలువాతో ఘనంగా సత్కరించి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చలపాటి చంద్ర మాట్లాడుతూ రాయలసీమలో తిరుగులేని నాయకుడు ప్రజలు అభిమానించే ఏకైక నాయకుడు బత్యాల చెంగల్ రాయుడు అని తిరుపతి, కోడూరు, రాజంపేట నియెాజక వర్గాలలో ఆయన ముద్ర చెరగనిదని వచ్చే స్దానిక సంస్దల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి దమ్మున్న నాయకున్ని పార్టీ అధిష్టానం రాజంపేట ఇంచార్జ్ గా ప్రకటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిట్టా సాయి, పలువురు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.