

మెయిన్ సెంటర్ లో బాణాసంచా కాల్చి , స్వీట్స్ పంపిణి చేసిన : బి అర్ ఎస్ నాయకులు
మీడియా ప్రతినిధి శ్రీనివాస రాథోడు కల్లూరు ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పాలు , పండ్లు పంపిణీ చేసిన : నాయకులు
VRM మీడియా ప్రతినిధి శ్రీనివాస రాథోడ్
కల్లూరు టౌన్ : (గురువారం) బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ( కేటీఆర్) జన్మదిన వేడుకలు మాజీ శాసన సభ్యులు సండ్ర వెంకట వీరయ్య నాయకత్వం లో.కల్లూరు మండల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా
కల్లూరు లోని మెయిన్ సెంటర్లో ఏర్పాటు చేసిన వేదిక వద్ద, బి అర్ ఎస్ మండల సీనియర్ నాయకులు మాజీ జెడ్పిటిసి సభ్యులు కట్టా అజయ్ కుమార్ డా, లక్కినేని రఘు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు .
ఈ సందర్భంగా నాయకులు కట్టా అజయ్ కుమార్ , డా,, లక్కినేని రఘు లు మాట్లాడుతూ…, పిన్న వయసులోనే ప్రపంచ స్థాయి లో గుర్తింపు పొంది, అన్ని పాలన శాఖల పట్ల తండ్రి కి తగ్గ తనయుడిగా గుర్తింపు పొందిన నాయకుడు కేటీఆర్ గారని అన్నారు., ముఖ్యంగా ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి అన్ని జిల్లా కేంద్రాలకు సైతం ఐ టి రంగాన్ని విస్తరింపజేసి , వేలాది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన గొప్ప దర్శనిక నాయకుడు కేటీఆర్ గారు అనీ కొనియాడారు. , అనంతరం స్థానిక ప్రభుత్వ వైద్యశాల నందు రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేసి, మెయిన్ సెంటర్ లో బాణసంచా కాల్చి ఘనంగ సంబరాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కాటంనేని వెంకటేశ్వరావు, పెడకంటి రామకృష్ణ, పెద్దబోయిన మల్లేశ్వరరావు, మేకల కృష్ణ, పోట్రు కిరణ్, కొరకొప్పు ప్రసాద్, ఉబ్బన వెంకటరత్నం, షేక్ కమ్లి, చిలంశెట్టి కిరణ్ కుమార్, అజ్మీర జమలయ్య, ఉప్పు సుబ్బారావు, కట్టా ఆర్లప్ప , రావి సూర్యనారాయణ, షరాబు వెంకటేశ్వరరావు, కావేటి నరసయ్య, సయ్యద్ రవూఫ్, వల్లభనేని రవి, బానోత్ కృష్ణ, ఏనుగుల అంజి, బండి వెంకటి, కుక్క. అంజన్ రావు, తడికమళ్ల సామేలు, దార్ల నరసింహారావు, పూసులూరి శ్రీనివాసరావు, చారుగుండ్ల సందీప్, రాచమళ్ళ నాగేశ్వరరావు, గద్దె నరేష్, కొత్తపల్లి వెంకటేశ్వర్లు, ఖమ్మంపాటి రమేష్, ఖమ్మంపాటి పుల్లారావు, బానోతు లక్ష్మణ్, ఏనుముల శివ, దర్నాసి కరుణకర్, మేకల. భద్రాచలం, కాశీమాళ్ళ పావనం, శంకర్రావు, శిరసాని రాజు,పైళ్ల విశ్వనాథం, ఇంతియాజ్, రామవరపు ప్రసాద్ , కంచపోగు సురేష్ , రవి, సురేష్, పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్య లో పాల్గొన్నారు