

VRM న్యూస్
Ch. బాల మౌలాలి
రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమా టోగ్రఫీ శాఖ మంత్రి వర్యులు కందుల దుర్గేష్ గారు తిరుమలకు పర్యటనకు విచ్చేసిన సందర్భంగా జనసేన రాయలసీమ జోనల్ ఎన్నికల కన్వీనర్ చెంగారి శివప్రసాద్ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మంత్రి దృష్టికి ఒంటిమిట్ట కోదండ రామాలయం అభివృద్ధి అంశాన్ని తీసుకుని వచ్చారు ఒంటిమిట్ట దేవస్థానం దక్షిణ భారతదేశ అయోధ్యగా పేరుపొందిన పవిత్ర క్షేత్రం గా ప్రాచీన కాలం నుంచి ప్రముఖతను ఉన్నదని ఆయన చెంగారి శివప్రసాద్ పేర్కొన్నారు పర్యాటక ప్రాధాన్యం ఉన్న ఈ స్థలాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించాలని కేంద్ర పర్యాటక శాఖ అమలు చేస్తున్న ప్రసాద్ స్కీమ్ ద్వారా నిధులు విడుదలను మంజూరు చేయవలసిందిగా కోరారు ఇందులో భాగంగా మంత్రి కందుల దుర్గేష్ ను ప్రత్యేక పర్యటన కు ఒంటిమిట్ట కు రావాలని ఆహ్వానించారు ఆలయ పరిసరాల్లో సౌకర్యాలు పెంచడం అభివృద్ధి పనులు చేపట్టడం ద్వారా ఆలయానికి దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తారని అన్నారు ఒంటిమిట్ట అభివృద్ధి విషయంపై మంత్రి స్పందన సానుకూలంగా ఉన్నట్లు చెంగారి శివప్రసాద్ తెలియజేశారు