Home ఆంధ్రప్రదేశ్ గండికోట గ్రామస్తులు సబ్ కలెక్టర్ ని కలిసి పోలవరం ప్రాజెక్టు సమస్యలపై వినతి పత్రం అందజేశారు

గండికోట గ్రామస్తులు సబ్ కలెక్టర్ ని కలిసి పోలవరం ప్రాజెక్టు సమస్యలపై వినతి పత్రం అందజేశారు

by VRM Media
0 comments

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన నిర్వాసితుల కష్టాలు మాత్రం తీరని పరిఅందజేశారు

రంపచోడవరం ప్రెస్ నోట్:VRM Media దుర్గా ప్రసాద

అల్లూరి సీతారామరాజు జిల్లా దేవిపట్నం మండలం గండికోట గ్రామస్తులు పోలవరం ప్రాజెక్టు వల్ల చాలా నష్టపోయామని తెలిపారు. గ్రామంలో పూర్వం నుండి నివసిస్తూ అన్ని ఆధారాలు ఉన్న కొంతమందికి ఇళ్ళు నిర్మించలేదని, ఆర్&ఆర్ ప్యాకేజీ పూర్తిస్థాయిలో ఇవ్వలేదని, మరి కొంతమందికి పద్దెనిమిది సంవత్సరాల ప్యాకేజీకి అనర్హులుగా పరిగణించి రావలసిన ప్యాకేజీ ఇవ్వలేదని, తమ ఇళ్ళకు సంబంధించి ఒరిజినల్ పట్టాలు మంజురుచేయాలనే సమస్యలపై సోమవారం సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటిడిఎ) కార్యాలయం వద్ద సబ్ కలెక్టర్ ను కలిసి తమ సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం ఇవ్వటం జరిగిందని గ్రామస్తులు తెలిపారు.ప్రభుత్వాలు మారినా నిర్వాసితుల తలరాతలు మారవని, చెప్పులు అరిగేలా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉండాల్సి వస్తుందని గ్రామస్తులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. కనీసం ఇప్పటికైనా మా సమస్యలపై ప్రభుత్వం స్పందించి మాకు రావలసిన నష్టపరిహారం ఇప్పించవలసిందిగా కోరుతున్నామని గ్రామస్తులు తెలిపారు.

2,851 Views

You may also like

Leave a Comment