
కడప అర్బన్ జులై 31:
తమ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు పట్టణానికి వచ్చిన సందర్భంగా గురువారం అశేష జన ప్రవాహాన్ని అడ్డుకునేం దుకు ముళ్ళకంచలు, రోడ్డు తవ్వడం, బార్కెట్లు ఏర్పాటు చేయడం ఎమర్జెన్సీని తలపించే విధంగా ఈ రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఎన్ని కుతుంతాలు చేసిన అవేం లెక్కచేయకుండా వైసీపీ శ్రేణులు, పటాపట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా జయప్రదం చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏకుల రాజేశ్వరి రెడ్డి అన్నారు.గురువారం కడపలోని తన కార్యాలయంలో ఆమె మాట్లా డారు. పోలీసులు ఇచ్చిన నోటీసులకు భయపడకుండా ఎన్ని కేసులు అయినా పెట్టుకొని ఎంతమందినైనా అరెస్టు చేయండి అని అన్నిటికి తెగించి ఈ కార్యక్ర మాన్ని జయప్రదం చేసినందుకు నెల్లూరు జిల్లా ప్రజలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఏకుల రాజేశ్వరి రెడ్డి హ్యాట్సాఫ్ చెప్పారు. రాబోయే రోజుల్లో ఇంకా ఇంతకు మించి రెట్టింపు ఉత్సాహంతో వైసీపీ శ్రేణులు పనిచేస్తాయని,మీ ఉడత బెదిరింపులకు మీ రెడ్ బుక్ రాజ్యాంగాన
