

కడప VRM న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ పి ఈశ్వర్ ఆగస్టు 02;
బెర్నార్డ్ షా, రాబర్ట్ సన్ లాంటి అంతర్జాతీయ నాటక కర్తలు, మహాత్మా గాంధీ, రవీంద్ర నాథ్ ఠాగూర్ వంటి మహోన్నత వ్యక్తులు, బందా కనక లింగేశ్వ రావు, పులిపాటి వెంకటేశ్వర్లు మొదలైన ప్రసిద్ధ రంగస్థల కళాకా రులు బళ్లారి రాఘవ నటనా వైభవాన్ని చూసి ప్రశంసల జల్లులు కురిపించారని, ఆయన భారతదేశం గర్వించదగ్గ మహానటుడని, తెలు గు నాటకాన్ని మహోన్నత శిఖరా లకు తీసుకెళ్లారని , దేశ విదేశాల్లో తన నటన వైభవాన్ని సాటి చెప్పి రాయలసీమకు వన్నెతెచ్చిన నటనా చక్రవర్తని వైయస్సార్ జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు ఆచార్య మూల మల్లికార్జున రెడ్డి తెలియజేశారు.కడప రాజీవ్ కల్చరల్ క్లబ్బులో శనివారం ఉదయం వైయస్సార్ జిల్లా రచయితల సంఘం వారు బళ్లారి రాఘవ 146 వ జయంతిని ఘనంగా నిర్వహించా రు