Home ఆంధ్రప్రదేశ్ పెన్షన్ దొంగలను పట్టుకున్న పోలీసులు-కీలక పాత్ర పోషించిన డిఎస్పీ సహాబాజ్ అహ్మద్

పెన్షన్ దొంగలను పట్టుకున్న పోలీసులు-కీలక పాత్ర పోషించిన డిఎస్పీ సహాబాజ్ అహ్మద్

by VRM Media
0 comments

డిఎస్పి ఆధ్వర్యంలో రోజుల వ్యవధిలో దొంగలను పట్టుకున్న పోలీసులు

పాడేరు ( అల్లూరి జిల్లా ) VRM Midea

అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ & డి.ఎస్.పి సహబాజ్ అహ్మద్ నేడు స్థానిక ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెదబయలు మండలం బొండపల్లి పంచాయతీకి సంబంధించి ఈనెల 1వ తేదీన పెన్షన్ దారులకు పంపిణీ చేసేందుకు ఆ పంచాయతీ వెల్ఫేర్ అసిస్టెంట్ అధికారి కటారి.మత్స్యబాబు ముందు రోజు అనగా గత నెల 31వ తేదీన పెదబయలు ఎస్బిఐ బ్యాంకు నుండి 15,62,000 నగదు విత్ డ్రా చేసి తీసుకు వస్తుండగా మార్గ మధ్యలో బంగారు మెట్ట గ్రామ పరిధిలో కొంతమంది దుండగులు వెల్ఫేర్ అసిస్టెంట్ ను మారణాయుధాలతో బెదిరించి నగదు దొంగిలించుకుపోయారని. ఈ ఘటనపై సదరు వెల్ఫేర్ అసిస్టెంట్ స్థానిక ఎంపీడీవో ఇచ్చిన ఫిర్యాదు మేరకు తక్షణమే డిఎస్పి సహాబాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో పలు పోలీస్ టీములను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టిన తరుణంలో జోలాపుట్టు గ్రామ శివారులో ముగ్గురు వ్యక్తులు అధిక మోతాదులో నగదు పంపిణీ చేసుకుంటుండగా గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని ఆరా తీయగా వారే నిందితులనే విషయం బయటపడిందని తెలిపారు. వారి వద్ద నుండి 15,62,000 నగదు, 3 ఆండ్రాయిడ్ ఫోన్లు రెండు కత్తులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే ముద్దాయిలైనటువంటి 1. మహాపాత్ర సంతోష్ కుమార్ (28) 2. కోర. వికాస్ (25) 3. దురై. స్వప్నిల్ (19) పై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరలించడం జరుగుతుందని తెలిపారు. ఈ కేసు ఎంత వేగవంతంగా చేదించేందుకు గల ముఖ్య కారణం డీఎస్పీ సహబాజ్ అహ్మద్ కారణమని సంఘటన జరిగిన వెంటనే సమాచారం తెలుసుకున్న డీఎస్పీ అహ్మద్ తక్షణమే ఆ ప్రాంతానికి చేరుకొని దోపిడీ ఎలా చేశారు ఏమిటి అనే దానిపై పూర్తిస్థాయిలో వివరాలు సేకరించి వారిని పట్టుకునేందుకు ఒక సరికొత్త వ్యూహంతో ఆయన ఆధ్వర్యంలో పలు పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి రేయిం పగలు అనే తేడా లేకుండా ఆ కేసు చేధన పై పూర్తిస్థాయిలో దృష్టి సారించి ఆ పోలీస్ బృందాలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ మూడు రోజుల్లో చేదించేలా చేశారని ఈ ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు. సంఘటన జరిగిన మూడు రోజుల్లోనే ఈ కేసు చేదించిన డిఎస్పి సహాబాజ్ అహ్మద్ తో పాటు ఆయన నేతృత్వంలో విధులు నిర్వహించిన సిబ్బందికి అభినందనలు తెలియజేస్తూ వేగవంతంగా కేసును ఎంతో చాకచక్యంగా చేదించిన పోలీసు సిబ్బందికి రివార్డులు అందజేశారు.

2,817 Views

You may also like

Leave a Comment