Home ఆంధ్రప్రదేశ్ బీసీల ఆత్మగౌరవం కాపాడే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ…శొంఠి శివరామ ప్రసాద్ గౌడ్

బీసీల ఆత్మగౌరవం కాపాడే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ…శొంఠి శివరామ ప్రసాద్ గౌడ్

by VRM Media
0 comments

VRM Media

శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ శొంఠి శివరామ ప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీల ఆత్మ అభిమానాన్ని, ఆత్మ గౌరవాన్ని కాపాడే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమేనని, బీసీలను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి బాటలో నడిపించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్ కల్పించడం ద్వారా తొలిసారిగ రాజకీయ అవకాశాలు కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీకె దక్కిందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి స్వయం ఉపాధి రుణాలు ఇచ్చి, బిసి లను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసేందుకు ఎం ఎస్ ఎం ఈ . పరిశ్రమల్లో సబ్సిడీలు అందించి బీసీలు ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేసిందని అన్నారు.

చంద్రబాబు గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా చేనేతలకు 200,500 యూనిట్లు ఉచిత కరెంట్ అమలు చేశారని, నాయి బ్రాహ్మణుల సెలూన్లకు 150 యూనిట్లు ఉచిత విద్యుత్ అమలు చేశారని, దేవాలయాల్లో పనిచేసే నాయి బ్రాహ్మణులకు గౌరవ వేతనం 25వేలకు పెంచారని, దేవాలయ కమిటీల్లో నాయి బ్రాహ్మణునికి తప్పనిసరిగా చోటు కల్పించే విధంగా చర్యలు తీసుకున్నారని, కల్లుగీత కులాలకు మద్యం షాపుల్లో 10 శాతం షాపులు కేటాయించారని, 10% బారుషాపుల్లో 50% సబ్సిడీ ఫీజు తో అవకాశం కల్పించారని, కల్లుగీత పై ఆధారపడిన కార్మికులకు నీరా కార్పొరేషన్ ఏర్పాటు చేసి, త్వరలోనే నిర్దిష్టమైన విధివిధానాలు తీసుకువస్తారని, బీసీలకు అండ.. తెలుగుదేశం పార్టీ జెండా అనే నినాదంతో ఎన్నికల సమయంలో 50 సంవత్సరాలు దాటిన వారికి 4000 రూపాయలు పెన్షన్ అమలు చేశారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు గారు బీసీలకు 34 శాతం రిజర్వేషన్ పునరుద్ధరణకు చర్యలు తీసుకుందని తెలిపారు.

గత జగన్ రెడ్డి హయాంలో రాష్ట్రంలో బీసీల ఆస్తులకు, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని, బీసీలకు అందవలసిన 75 వేల కోట్ల సబ్ ప్లాన్ నిధులను దారి మళ్ళించారని, బీసీలు అనుభవిస్తున్న 34% రిజర్వేషన్లు 24 శాతానికి తగ్గించి, తద్వారా సుమారు 16,800 మంది బీసీలను రాజకీయ పదవులకు దూరం చేశారని, కుల కార్పొరేషన్ లను జగన్ రెడ్డి నిర్వీర్యం చేశాడు అన్నారు.

చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నుముకగా పనిచేస్తారని, బీసీలను రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగే విధంగా చంద్రబాబు గారు పని చేస్తారని తెలిపారు.

జగన్ రెడ్డి, వైసీపీ నాయకుల మాయమాటలు నమ్మవద్దని,బిసి లు జగన్ రెడ్డి ని నమ్మి ఒక్కసారి అధికారమిచ్చినందుకే రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశాడని, జగన్ రెడ్డిని, వైసీపీ నాయకులను రాష్ట్రం నుండి తరిమి కొడితేనే బీసీలు బాగుపడతారని అన్నారు.

మంత్రివర్యులు, రాష్ట్ర బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు కొల్లు రవీంద్ర గారి ఆదేశాల మేరకు, రాష్ట్ర గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, బీసీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి వీరంకి వెంకట గురుమూర్తి గారి సూచన మేరకు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని, అన్ని నియోజకవర్గాల్లో బీసీలను కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ,అభివృద్ధి ఫలాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లే విధంగా కృతజ్ఞత ర్యాలీలు,బీసీ సదస్సులు నిర్వహించాలని తెలిపారు. కావున ప్రతీ నియోజకవర్గంలో కూటమి పార్టీల బీసీ నాయకులు అందర్నీ కలుపుకొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని శొంఠి శివరాం ప్రసాద్ గౌడ్ కోరారు.

2,811 Views

You may also like

Leave a Comment