Home వార్తలుఖమ్మం మహా యోగ సేవా కార్యక్రమాన్ని జయప్రదం చేయండి

మహా యోగ సేవా కార్యక్రమాన్ని జయప్రదం చేయండి

by VRM Media
0 comments

Vrm media
హుజూర్నగర్ తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేటు విద్యాలయాల్లో యోగా విద్యను కేజీ టు పీజీ వరకు పాఠ్యాంశంగా అమలు చేయాలని తెలంగాణ యోగా సంఘ రాష్ట్ర అధ్యక్షులు మరికంటి వెంకట్ గారు అన్నారు
ఈ ఏడాది డిసెంబర్ 13న హైదరాబాదులోని ఇందిరా పార్క్ లో నిర్వహించనున్న మహాయోగ సేవ సన్నాహక సమావేశం హుజూర్నగర్ లోని టౌన్ హాల్ నందు ఆదివారం నిర్వహించారు ఈ సందర్భంగా మరికంటి వెంకట్ గారు మాట్లాడుతూ నేటి విద్యార్థులు ఒత్తిడిని తొలగించుటకు విద్యాలయాల్లో కేజీ టు పీజీ వరకు పాఠ్యాంశంగా యోగాన్ని చేర్చాలన్నారు 90 రోజుల లోపు 50 వేల మంది యోగా నిపుణులకు 50వేల రూపాయలు గౌరవ వేతనంగా గ్రామ మండల జిల్లా పట్టణ జనాభా ప్రాతిపదికన నియమించాలన్నారు
యోగ మంత్రిత్వ శాఖ కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలని అన్నారు యోగ జీవన శాస్త్ర వేత్తలను చట్టసభల్లోకి నామినేటెడ్ పద్ధతి ద్వారా తీసుకోవాలని డిమాండ్ చేశారు పూర్తి యోగ బాధ్యతను ప్రభుత్వ నిర్వహించాలని కోరుతూ గౌరవ తెలంగాణ హైకోర్టులో ది 28 7 2025న ప్రజాప్రయోజనాల వాజ్యం పిల్ దాఖలు చేశామన్నారు దాఖలు చేశామన్నారు పైన పేర్కొన్న డిమాండ్ల సాధనకై డిసెంబర్ 13న ఇందిరాపార్క్ లో నిర్వహించనున్న మహాయోగ సేవ కార్యక్రమాన్ని విజయవంతం చేయుటకై అతిథులందరూ పాల్గొని తెలంగాణ ప్రజలందరూ లక్షలాదిగా తరలిరావాలని కోరుతూ ఈ సమావేశంలో మహాయోగ సేవ ప్రచార గోడపత్రిక ఆవిష్కరించడం జరిగింది . ఈ కార్యక్రమంలో హుజూర్నగర్ నియోజకవర్గ యోగ సేవకులు గుండా కాంతయ్య గారు బోనాల శ్రీనివాసరావు గారు బొగ్గరపు రాధాకృష్ణ గారు పిల్లిట్ల వీరస్వామి గారు బేతం రామంజి రెడ్డి గారు నీలం నాగరాజు గారు వస్తే పల్లి చంద్రశేఖర్ గారు మట్టపల్లి శ్రీమన్నారాయణ గారు తమర నరసింహ రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు. పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో హైకోర్టులో 28 7 2025న ఈ డిమాండ్ల సాధనకై ప్రభుత్వం వారికి సూచన చేయవలసిందిగా ప్రజాప్రయోజనాల వ్యాజ్యం పిల్ దాఖలు చేసిన అడ్వకేట్, రాష్ట్ర యోగ సంఘం అధ్యక్షులు మరికంటి వెంకట్ అడ్వకేట్ ని పౌర సన్మానం చేసి వారిని ఘనంగా సన్మానించడం జరిగింది.

2,813 Views

You may also like

Leave a Comment