Home ఆంధ్రప్రదేశ్ అతికారి క్రిష్ణ ఆధ్వర్యంలో జగన్ మెాహన్ రాజుకు ఘన స్వాగతం పలికిన జనసైనికులు

అతికారి క్రిష్ణ ఆధ్వర్యంలో జగన్ మెాహన్ రాజుకు ఘన స్వాగతం పలికిన జనసైనికులు

by VRM Media
0 comments

సిద్ధవటంVRM న్యూస్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఆగస్టు 22

సిద్ధవటం మండలంరాజంపేట జనసేన పార్టీ పార్లమెంట్ సమన్వయకర్త అతికారి క్రిష్ణ ఆదేశాల మేరకు ఆయన ఆధ్వర్యంలో సిద్ధవటం మండలం మాధవరం-1 గ్రామంలో అతికారి క్రిష్ణ అనుచరులు డేరంగుల శ్రీకాంత్, అవ్వారు రవిశంకర్ రాజంపేట టిడిపి అసెంబ్లీ ఇంచార్జ్ చమర్తి జగన్మోహన్ రాజుకు ఘనంగా స్వాగతం పలికారు. బ్యాండు భాజాలతో, టపాసులు పేలుస్తూ ఆహ్వానం పలికారు అనంతరం గ్రామ శక్తి శ్రీ శీతల గంగమ్మ తల్లి దర్శనం చేసుకుని కొబ్బరికాయలు కొట్టి అమ్మవారిని దర్శించుకున్నారు. తర్వాత రాజుకు గజమాల వేసి శాలువా కప్పి ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా స్దానిక యువ నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ రాజంపేట అసెంబ్లీ ఇన్చార్జిగా జగన్ మోహన్ రాజు నియమితులైన సందర్బంగా కూటమి పార్టీల పొత్తు ధర్మంలో భాగంగా జనసేన పార్టీ రాజంపేట పార్లమెంటు ఇంచార్జ్ అతికారి క్రిష్ణ ఆదేశానుసారం ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప మండలాధ్యక్షుడు మాసా బాలక్రిష్ణ, జనసేన చేనేత రాష్ట్ర వికాస కార్యదర్శి రాటాల రామయ్య, సుబ్బరాయుడు, శివ కేశవులు, కొండయ్య, సాయి, రామక్రిష్ణ, వెంకటేశు తదితరులు పాల్గొన్నారు.

2,928 Views

You may also like

Leave a Comment