


కడప జిల్లాVRM న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ పి ఈశ్వర్ ఆగస్టు 24
ట్యాంక్ బండ్ వద్ద ఉన్న రెడ్డి సేవా సమితి వసతి గృహంలో చదివే విద్యార్థి నులకు నైపుణ్య శిక్షణ అందించడం కోసం రెడ్డి సేవా సమితిలో యోగివేమన నైపు ణ్యాభివృద్ధి కేంద్ర గ్రంథాలయాలను ప్రారంభిం చినట్లు కడప రెడ్డి సేవాసమితి ప్రధాన కార్యదర్శి లెక్కల కొండారెడ్డి తెలిపారు.ఆదివారం ఆ సమితి భవనం లో కడప చిన్మయ మిషన్ అధ్యక్షుడు తురీయానంద స్వామి ఆధ్వర్యంలో పూజారి కార్యక్రమాలు నిర్వహించారు. లెక్కల కొండారెడ్డి మాట్లాడుతూ ఇక్కడ చదివే విద్యార్థినులకు చదువు పూర్తి కాగానే ఉద్యోగం, స్వయం ఉపాధి వైపు నడిపించే లక్ష్యం తో ఈ సెంటర్ ను ప్రారంభించామని అన్నారు.ఈ సెంటర్కు అరబిందో ఫార్మ్ ఫౌండేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కంభం నిత్యానంద రెడ్డి, డైరెక్టర్ పి శరత్ చంద్రారెడ్డి
లు ఆర్థిక సహకారం అందించారని తెలిపారు