
కడప అర్బన్ VRM న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ పి ఈశ్వర్ ఆగస్టు 28:
కడప నగర పరిధిలోని బిల్టప్ కు కూత వేటు దూరంలో ఉన్న లోహియా నగర్, రియాజ్ థియేటర్ వద్ద స్పీడు బ్రేకర్లు వేసి ప్రమాదాలను నివారించాలని బుడగ జంగం సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ధూపం రాజు అధికారులను కోరారు.గురువారం ఆయన రియాజ్ థియేటర్ వద్ద మీడియాతో మాట్లా డారు . రోడ్డు దాటే సమయంలో ప్రతి నిత్యం వృద్ధులు, విద్యార్థులు ప్రమాదాలకు గురి అవుతున్నారని వాపోయా రు.ఇటీవల తన తండ్రి కూడా ఇక్కడ ప్రమాదానికి గురై ఆసుప త్రిలో నెల రోజుల పాటు చికిత్స పొందారని ఆవేదన వ్యక్తంచే శారు.మహిళలు పనులకు, విద్యా ర్థులు పాఠశాలలకు పోతుంటారని చెప్పారు.ఈ ప్రాంతంలో బడుగు, బలహీన వర్గాల పేదలు ఎక్కువగా నివాసం ఉన్నారని తెలిపారు కావున అధికారులు ఈ ప్రాంతం పై దృష్టి సారించి స్పీడ్ బ్రేకర్స్ వేసి ప్రమాదాలను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు